22, నవంబర్ 2025, శనివారం

నేను

 నేను


మనసును మదించి అడిగాను నేను ఎవరు అని


శరీరమా అహంకారమా అభిమానమా ఎవరు నేను మనసును అదుపు ఉంచి ధ్యానించాను


 నేను ఎవరు అని 


చీకటి వెలుతురు సమ్మేళనం అంతా శూన్యం


 ఈ జన్మలో తెలియదు నేను ఎవరు అని 


వచ్చే జన్మలో తెలియదు నేను ఎవరు అని


 తెలియని దానికోసం వెతుకులాట


 వృధా ప్రయాస


 భగవంతుని చేరువ కోసం చేసే ప్రయాసే జీవిత లక్ష్యం


 అదే జీవిత పరమార్ధం 


సి శారద

కామెంట్‌లు లేవు: