* 🕉️
*వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు*
కం.
విద్యాబుద్ధుల నడుగగ
సద్యోవరముగ నొసగెడి చవితిగణేశా!
పాద్యముతోమొదలిడి నిన్
వాద్యాంతముగా గొలిచెద వందనమిదిగో
కం.
వరదాయక గణనాథా!
విరిదండల పత్రితోడ వేనామములతో
పరిపరివిధముల గొలుతురు
కరిముఖుడౌ నిన్ను భక్తి కాశ్యపి నందున్
కం.
ఆకుల పూజల జేసియు
నీకై యుండ్రాళ్ళ నిడగ నిజమగు తృప్తిన్
మాకై వరముల నొసగే
యో కరిముఖదేవర జయ మో గణనాథా!
కం.
కరుణను జూడవె తండ్రీ!
వరముల నీయవె తగువిధి బాసట వగుమా!
చిరమగు సుబుద్ధి సిద్ధుల
కరముగ నొసగుమ గణేశ! కామితవరదా!
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి