*వినాయకాయ 🐘 సందేశం*
వినాయకుడినే విఘ్నరాజు , విఘ్నహంత్రి, విఘ్నపతి అని కూడా పిలుస్తారు. మనకే విఘ్నాలు ఎందుకు వస్తాయి? ఈ విషయాలలో ఎన్నింటినో వినాయకుడు , తన శరీర రూపం ద్వారానే మానవజాతి కి సమాధానం చెప్పారు.
*🐘చెవులు* - ఇతరులు తన గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో , ఇతరుల గురుంచి అనవసరమైన విషయాలు వినాలనే అభిలాష కలిగి చెవులు అప్పగించి వినేవాళ్ళకు విఘ్నాలు తప్పవు అని చెప్పడానికే పెద్ద చెవులు వినాయకుడివి.
*🐁🐀ఎలుక వాహనం - 🐘ఏనుగు శరీరం* :- ఎలుక అంత చిన్న విషయాన్ని , ఏనుగంత పెద్దది చేసి ఆలోచించడం వల్ల విఘ్నాలు తప్పవు అని ఇక్కడ సందేశం. ఇతరుల విషయాలలో లేదా తన సొంత విషయాలలో ఉండవలసిన దానికన్నా అధికంగా పరిగణించడం వలన విఘ్నాలు తప్పవు. పెద్దలు దీనినే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవడం అని సామెత పెద్దలు చెప్పారు.
*🐘వినాయకుని అవస్థ - 🌙🌚చంద్ర పరిహాసం* :- చంద్రుడుని వేదాంగం అయిన జ్యోతిష్య శాస్త్రంలో మనస్సుకి/మానసిక స్థితికి కారకుడిగా వర్ణించారు. ఇక్కడ నడవలేక నడుస్తున్న స్థూలకాయుడైన వినాయకుడు అంటే స్థూలంగా అందరికి కనబడే , అర్థమైయ్యే శరీర అవస్థలు మరియూ ఆర్ధిక వ్యవస్థలు అని అర్ధం. ఎవరైతే ఇతరుల శరీర సౌందర్యాన్ని , అనారోగ్యాలని , ఆర్ధిక పరిస్థుతులని విమర్శిస్తారో వారికి విఘ్నాలు తప్పవు అని చెప్పడమే ఇందులోని సూక్ష్మం.
*🐘గణపతికే ప్రథమ పూజ?*
నీలోని ఇంద్రియములనే గుంపునే గణములు అంటారు. వీటికి పతి(నాయకుడు) మనస్సు/బుద్ధి/ఆత్మ . గణపతి అంటే నీలోని ఇంద్రియములనే గుంపుకి నాయకుడి నీ మనస్సు/బుద్ధి/ ఆత్మ అని అర్ధం. గణపతికే ప్రథమ పూజ అని అనడంలో అర్ధం ఏమిటంటే ఇతరులను నీవు విమర్శించే ముందు నిన్ను నీవు (నీ మనస్సుని) ఆత్మపరిశీలన చేసుకోవడమే.
ఇలా చెప్పుకుంటూ పోతే మనకు కలిగే విఘ్నాలకు మనమే కారణమని మనకు తెలియచెప్పడమే మన వినాయక వ్రత కల్పం యొక్క ఉద్దేశ్యం.
🐘గణపతి అంటే మనము ఈ విషయలోలురు కాకుండా చేయగల బుద్ధిశక్తి అన్నమాట. ఆ గణపతి మీ అందరికీ చక్కటి బుద్ధిని ప్రసాదించాలని తద్వారా మీరు తలపెట్టిన పనులలో విజయాలు చేకూరాలని, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... ఈ పండుగ ద్వారా 🕉️హిందు, ☪️ముస్లిం, ✝️క్రిస్టియన్, ☸️జైన, 🪯సిక్కు, ☮️✡️🔯🕎☯️☦️🛐 తదితర మతసామరస్యం భారతదేశంలో వెల్లివిరియాలని ఆ భగవంతున్ని సదా ప్రార్థిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు
*వినాయక 🐘 చవితి శుభాకాంక్షలు*
*శిరిపురపు శ్రీధర్ శర్మ*
🔥రాష్ట్ర అధ్యక్షులు🔥
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి