26, అక్టోబర్ 2020, సోమవారం

ఆంధ్రకవుల అపరాధాలు

 🚩🚩ఆంధ్రకవుల అపరాధాలు.🚩🚩

‘ఆంధ్రకవుల అపరాధాలు’ పద్యాలు మొట్టమొదటగా 

ఆంధ్రపత్రిక కాళయుక్తినామ సంవత్సర ఉగాది (1918) 

సంచికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత 1965లో ఆ పత్రిక స్వర్ణోత్సవ సంచికలో పునర్ముద్రితమయ్యాయి. 

ఇందులో #నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, తిమ్మన, పింగళి సూరన, #తెనాలి రామకృష్ణుడు లాంటి హేమాహేమీలందరినీ #వేంకట రామకృష్ణ కవులు అధిక్షేపాత్మక ధోరణిలో విమర్శించారు. 

      వ్యాస భారతాన్ని తెనిగించటానికి నన్నయ పూనుకున్నాడు. తెలుగు ప్రజలకు తొలి గ్రంథాన్ని అందించాలనుకున్నాడు. అంటే కవిత్వాన్ని సంస్కృత భాష నుంచి తెలుగు వైపు మళ్లించే ఒక గట్టి ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతవరకు బాగుంది. మరి అలాంటప్పుడు భారతాన్ని చక్కటి తెలుగు పద్యంతో ప్రారంభించకుండా ‘#శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’’ అన్న సంస్కృత శ్లోకంతో ఎందుకు ప్రారంభించాలి అంటూ వేంకట రామకృష్ణ కవులు తమ మొదటి అస్త్రాన్ని ఆదికవిపైనే సంధించారు..

#ఆంధ్ర లోకోపకారము నాచరింప 

భారతమ్మును నన్నయ భట్టు తెలుగు 

జేయుచున్నాడు సరియే బడాయిగాక

తొలుత సంస్కృత పద్య మెందులకు జెపుడి

      బడాయి కాకపోతే నన్నయ తెలుగు భారతాన్ని సంస్కృత శ్లోకంతో ప్రారంభించాలా అని అధిక్షేపించారు. అంతేకాదు అవతారికలో తన సహపాఠి నారాయణభట్టును పేర్కొన్న నన్నయ విద్యాగురువైన #వ్యాసుణ్ని స్తుతించకపోవడం తప్పుకాదా అంటూ ప్రశ్నిస్తారు. అధర్వణుడు భారతం రాసినట్లు అప్ తన గ్రంథంలో ఉదాహరించాడు. అయితే ఆ భారతాన్ని చూసి సహించలేకే నన్నయ మళ్లీ భారత రచనకు ఉపక్రమించాడంటారు ఈ కవులు.

      ఇక #తిక్కన ‘‘జాత్యముగాని సంస్కృత మెయ్యెడ జొన్ప’’నని ప్రతిజ్ఞ చేశాడు. తత్సమ పదభూయిష్టమైన శైలిని తోసిరాజన్నాడు. అన్వయ కాఠిన్యం అనిపించినా అచ్చ తెలుగు పదాలనే భారత రచనలో ఎక్కువగా ప్రయోగించాడు. ఆ అంశాన్నే తిప్పి ఇలా అంటారు రామకృష్ణకవులు.

#అచ్చతెనుగు పదంబుల నిచ్చకొలది 

బుచ్చి తలతిక్కయన్వయములను బెట్టి 

పాడుచేసెను నన్నయభట్టుదారి 

యుభయకవిమిత్రులష! త్రిక్కయొజ్జ గారు

      అంతేకాదు తిక్కన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం రాశాడు. అది కూడా ‘#కిమస్థిమాలాం కింకౌస్తుభంవా’’ అంటూ హరిహరనాథుణ్ని స్తుతించిన శ్లోకం. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ రామకృష్ణకవులు, తిక్కన తనకు సంస్కృత భాషలో తగిన శక్తి లేక, ఎలాగో బిగబట్టి ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్పగలిగాడు, అలాంటి వానికి ‘ఉభయకవిమిత్ర’ అనే బిరుదును ఏ ప్రభువిచ్చాడో మరి! అంటూ ఎద్దేవా చేస్తారు. తర్వాత ఎర్రన గురించి చెబుతూ మంత్రి భాస్కరుడి కంటే గొప్పవాడినని భావించి ఎర్రన రామాయణం రాశాడు. అందుకే అది ఊరూ పేరూ లేకుండా పోయింది. అంతేకాదు అమాయకత్వంతో తిక్కన దయదలచి అరణ్యపర్వ శేషాన్ని వదిలిపెట్టడంతో ఎర్రన కవిత్రయంలో చోటు సంపాదించుకోగలిగాడు గానీ అందులో ఆయన ఘనత ఏముంది అంటూ ‘‘పామరుడువోలె దిక్కన సోమయాజి/ వెఱచియాంధ్రీకరింపక విడిచినట్టి/ భారతమ్మున వ్రేేల్వెట్ట బట్టి గాని/ #యెఱప్రెగ్గడ బండార మెవరెరుగరు’’ అంటారు. అంతేకాదు ఎర్రన హరివంశం తెనిగించాడు, మంచిదే. కానీ, అది నాచనసోముని ఉత్తర హరివంశం కంటే గొప్పదా? అంటూ నాచన సోముణ్ని ఆకాశానికెత్తుతారీ కవులు.

      ఇక పోతన సహజ పాండిత్య బిరుదాంకితుడు. ‘‘సత్కవుల్‌ హాలికులైననేమి’’ అంటూ రాజాశ్రయాన్ని నిరసించాడు. అయితే అది నిజంకాదని గురుకులక్లిష్టుడై విద్యనేర్చుకోలేని పోతనను ఏరాజు మాత్రం ఆదరిస్తాడంటారు వేంకట రామకృష్ణ కవులు. అంతేకాదు ఛందోవ్యాకరణ శాస్త్రాల్లో దిట్టలైన వారినే ప్రభువులు ఆదరిస్తారు గానీ, దేవుళ్లను కీర్తించినంత మాత్రాన కాదంటూ ఇలా చెబుతారు..

#పాడికవిత్వమల్లు పోతరాజును ఱేడు 

నేడు పిలిచి గౌరవింపరామి 

హాలికుడయి రేగి యవనీశ్వరుల దిట్టె 

నక్క ద్రాక్షపండ్ల నానుడి గతి

      పోతన్నను ఏ రాజూ ఆదరింపకపోవడంతో హాలికుడుగా మారి కవిత్వం రాసుకున్నాడు. కానీ అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లుగా రాజుల్ని #మనుజేశ్వరాధములంటూ తిట్టిపోశాడు. అంతేకాదు శ్రీనాథుని దయవల్ల సర్వజ్ఞసింగభూపాలుని ఆస్థానాన్ని సందర్శించి భోగినీదండకం రాయగలిగాడని కూడా అంటారు! 

      #శ్రీనాథుడి గ్రంథాలు చాలావరకు ఆంధ్రీకరణలే. అవి కూడా మూల శ్లోకాలలోని సుదీర్ఘ సమాసాలకు డు, ము, వు, లు చేర్చి యథాతథ]ంగా తెనుగు చేసినవే అధికం. పల్నాటి వీర చరిత్ర లాంటి ఏదో ఒక్క స్వతంత్ర గ్రంథాన్ని రాసినా దానినెవరూ పెద్దగా మెచ్చుకోలేదు. ఈ విషయాన్నే రామకృష్ణ కవులు పేర్కొంటూ, ‘‘ఆంధ్రకవిచక్రవర్తుల కెందరకును/ నీ పలుకు చాలు మేలు బంతియగుగాక!/ తెలుగు సేతయెకా! స్వతంత్రించి నీవు/ చేసినది యేది? శ్రీనాథ చెప్పుకోగ’’ అంటూ ఆ కవిసార్వభౌముణ్ని ఎద్దేవా చేస్తారు. అంతేకాదు అందలాలెక్కిన శ్రీనాథుడు గొప్ప కవీశ్వరుడు కావచ్చునేమో గాని గుణాఢ్యుడు మాత్రం కాలేడంటారు.

      ఇక, #పెద్దన మనుచరిత్రకు మూలం మారన మార్కండేయ పురాణం. మనుచరిత్ర అవతారికలో, పూర్వ తాళపత్ర గ్రంథాల నుంచి విషయాన్ని అపహరించి కొందరు కవులు రచనలు చేస్తారని, వారు కుకవులు అవుతారని అంటాడు పెద్దన. అంతేకాదు అలాంటి వారికి కొరత వేయడమే శిక్ష అని కూడా అంటాడు. ఆ విషయాన్నే లేవనెత్తి మరి పెద్దన మాత్రం చేసినదేమిటి? అంటూ ఇలా అధిక్షేపిస్తారు వేంకట రామకృష్ణ కవులు...

#మారన కథా విధానము జూఱలాడి 

కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి 

మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె

నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు

      అంటే మారన నుంచి కథను సంగ్రహించి, శ్రీనాథుడి నుంచి రచనా విధానాన్ని కొల్లగొట్టిన పెద్దన ఆంధ్ర కవితా పితామహుడిగా వాసికెక్కాడట. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయులు తన పల్లకిపై కూర్చుండబెట్టుకొన్నాడు. అగ్రహారాలు దానమిచ్చాడు. కానీ ముక్కు తిమ్మనార్యుని కంటే రచనా ధురీణుడా? పెద్దన అని కూడా వేంకట రామకృష్ణ కవులు ప్రశ్నిస్తారు. ఆ #తిమ్మన ముద్దు పల్కుల పారిజాతాపహరణ రచనకు ఒక నేపథ్యం ఉందంటారు. కృష్ణరాయలకు, తిరుమలాదేవి మీద ఉన్న అపార్థాన్ని తొలగించడానికే #నంది తిమ్మన ఆ గ్రంథాన్ని రాశాడని లోక ప్రతీతి. అలా వారి సాంసారిక జీవితాన్ని సరిదిద్దిన తిమ్మన రుణం తీర్చుకోవటం రాజుకు సాధ్యమా అంటూ ‘‘తనకునంతఃపురమునకు మనసులందు/ నెడమడుగు పుట్ట ముద్దులొల్కెడు నుడుల/ బారిజాతాపహరణంబు బల్కి మాన్చి/ నట్టి తిమ్మన ఋణము రాజెట్టు తీర్చు?’’ అని చెబుతారు. అలాగే శ్రీకృష్ణదేవరాయుల #విష్ణుచిత్తీయ కావ్యంలోని కథా వస్తువు శ్రావ్యమే కాని పాషాణపాకం లాంటి ఆ గ్రంథాన్ని ఎవరు చదివి అర్థం చేసుకోగలరని విమర్శిస్తారు. #పింగళి సూరన్నను గురించి చెబుతూ రాఘవ పాండవీయం లాంటి ద్వ్యర్థికావ్యాన్ని రాసి గొప్ప కీర్తిని గడించిన ఆయన, శుభమా అంటూ మరణ సమయంలో వైదికుడు పఠించే గరుడ పురాణాన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందో కదా! అంటారు. అంతేకాదు అద్భుత కల్పనా గౌరవంతో రాసిన కళాపూర్ణోదయ కావ్యానికి కలభాషిణి, రంభ లాంటి వేశ్యలను నాయికలుగా ఎంచుకోవటాన్నీ అధిక్షేపిస్తారు.

ప్రబంధ కవులందరూ ఇంచుమించు ఒకే మార్గంలో ప్రయాణించారు. ఒకరికి స్వప్నంలో ఎవరో ఒకరు ప్రత్యక్షమై గ్రంథ రచన చేయమంటే అందరికీ అలాంటి కలలే వస్తాయి. ప్రతి ప్రబంధం దేవతా ప్రార్థన, దేశ, పుర, రాజ, చాతుర్వర్ణ, వ్యవస్థల వర్ణనలతో మూసపోసినట్లు ఒకేలా ప్రారంభమవుతుందని చెబుతూ ‘‘దేవతా ప్రార్థనంబున దేశ నగర/ రాజవర్ణనములు కథారచన యంత/ తొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/ కవనముంజెప్పదగిన ప్రజానిధులకు’’ అంటూ మొత్తంగా ప్రబంధ కవులందరినీ ఎంతమాత్రం తలచకుండా అధిక్షేపిస్తారు పిఠాపురం జంటకవులు. ఇలా ఈ కవులు ఈ ఖండికలో ఆంధ్ర కవుల అపరాధాలను చమత్కారంగా ఎత్తిచూపుతారు. అయితే వీరు అహంకారులూ, దోషైకదృక్కులూ ఎంతమాత్రం కారు. సహజంగా అవధానుల్లో ఉండే చమత్కారం, అధిక్షేపం పాళ్లను కావాలని కొంచెం ఎక్కువ ప్రదర్శించారు. కానీ పూర్వ కవుల మీద వీరికి ఉన్న భక్తి గౌరవాలు అపారం. ఆ విషయంలో శంక అవసరం లేదు. కావాలంటే వారి మాటల్లోనే చూడండి...  

#పూర్వ కవిరాజులకు నిది భూషణంబొ 

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు 

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి 

గలుగువారలు లేరు జగమ్మునందు

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

కామెంట్‌లు లేవు: