17, ఆగస్టు 2020, సోమవారం

మంత్ర మహిమ🌹

ఒక యోగి జనంలో తిరుగుతూ జనం నోటి నుండి శివ శంభో అనే మంత్రాన్ని విన్నాడు.
ఎక్కడ చూసినా, ఈపని చేస్తున్నా, తింటున్న, పడుకుంటున్నా, తిట్టుకుంటున్నా, ఆడుకుంటున్న, పడుకుంటున్నా ఏది చేస్తున్న శివా అని ఒకరు శంభో అని ఒకరు ఇలా ప్రతిఒక్కరూ ఆ మంత్రాన్ని అసంకల్పంగా కూడా అనేస్తూ ఉండగా యోగికి విసుగొచ్చింది. ఏమిటీ ఈ జనం అంత ఇంత గోల పెడుతున్నారు. ఇదేంటో తేల్చేద్దాం అని శివుడి దగ్గరికి వెళ్ళాడు.

శివా ఏమిటి గోల! ఎవడు పడితే వాడు వేళాపాళా లేకుండా శివా శంభో ఏంటి గోల అన్నాడు. శివుడు నవ్వి.. అక్కడ ఓ పురుగు ఉంది చూడు అక్కడికి వెళ్లి శివశంభో అని దాని చెవి దగ్గర పలుకమన్నాడు. యోగి పురుగు దగ్గరికి వెళ్లి శివశంభో అన్నాడు. ఆక్షణమే అది చచ్చింది. స్వామి ఏమిటి శివశంభో అనగానే అలా చచ్చిపోయింది. aన్నాడు. శివుడు పురుగుని పట్టించుకోకుండా అదిగో సీతాకోకచిలుక చూడు ఎంత ముచ్చటగా ఉందొ.. అవును స్వామి చాలా బావుంది. ఐతే దాని దగ్గరకి వెళ్ళి శివశంభో అని ఉచ్చరించమన్నాడు. అలానే చేశాడు. ఎగిరే సీతాకోకచిలుక కాస్త చచ్చి కిందపడింది. స్వామి ఏమిటి అది కూడా చచ్చింది? అన్నాడు. అప్పుడు కూడా పట్టించుకోలేదు శివుడు.

అదిగో జింకని చూడు ఎంత ముద్దుగా ఉందొ! అవును స్వామి చాలా బావుంది. దాని దగ్గర కూడా శివశంభో అని పలుకు.. జింక దగ్గరగా తటపటాయిస్తూ వెళ్లి శివశంభో అన్నాడు వణుకుతున్న గొంతుతో.. తక్షణం మరణించింది. యోగి గుండె గుభేల్ మంది.. స్వామి ఏమిటి ఒకదాని వెనుక ఒకటి ఇలా మరణిస్తున్నాయి? ఇంకా ఆనామం ఉచ్చరించను. అన్నాడు. శివుడు పట్టించుకోకుండా మరోవైపు చూసి అదిగో ఇప్పుడే పుట్టిన శిశువు ఆశీస్సులకోసం వస్తున్నాడు. చూశావా!

చూశాను స్వామి. వేళ్ళు వెళ్లి ఆ శిశువు చెవిలో శివశంభో అని మంత్రాన్ని చెప్పు అన్నాడు. నేను వెళ్ళను స్వామి. ఆ మంత్రం పలుకను. అందరూ చనిపోతున్నారు. క్షమించండి అంటే పర్వాలేదు వెళ్లి మంత్రాన్ని చెవిలో చెప్పు అన్నాడు. భయపడుతూ భయపడుతూ వెళ్లి చిన్నగా శివశంభో అన్నాడు. అప్పటివరకూ ఏడుస్తూ ఉన్న పసివాడు కాస్త టక్కున లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈవింత! ఆవేమో చచ్చిపోయాయి. పసివాడు లేచి కూర్చున్నాడు. అని అడిగాడు.

శివుడు చిరుదరహాసం చేసి పసివాడివైపు చూశాడు. పసివాడు ఇలా అన్నాడు. పురుగుగా ఉన్నప్పుడు శివశంభో అంటే సీతాకోకచిలుక అయ్యాను. సీతాకోకచిలుక గా ఉన్నప్పుడు అంటే జింకనయ్యాను. జింకగా ఉన్నప్పుడు అంటే మనిషిగా పుట్టాను. నువ్వు మరొక్కసారి నాచేవిలో శివశంభో అంటే దివ్యత్వం పొందుతాను అన్నాడు. యోగి కంటనీరు పెట్టుకొని శివుడి పాదాలపై పడి క్షమించమని శరణువేడాడు.

నాయనా చూశావు కదా మంత్రప్రభావం. ఎప్పుడు ఎలా చేసినా ఎలా పలికినా అది దివ్యత్వానికి దారి తీస్తుందే తప్ప వృథాగా పోదు. అన్నాడు. మీలో ఏర్పడే ఒక్క బలహీనక్షణం కోసం మంత్రం మిమ్మల్ని పట్టుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ బలహీనక్షణం దొరికిన క్షణం మిమ్మల్ని దివ్యత్వం వైపు నడిపిస్తుంది. ఆ క్షణం రావాలని కోరుకోండి. అన్నాడు.
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: