*2159*
*కం*
మనమేమొనరించెదమో
మనలకు నవియే లభించు మహిలో నెపుడున్.
మనమొకరికి మేలొనరగ
మనకును హితమొనరు నొకరు మరువకు సుజనా.
*భావం*:-- ఓ సుజనా!ఎల్లప్పుడూ మనమేమి చేసెదమో మనకు కూడా ఈ భూలోకంలో అదే లభిస్తుంది. మనం ఒకరి కి మంచి చేస్తే మనకు కూడా మంచి చేసే వారు ఒకరు ఉంటారని మరువవద్దు.
*సందేశం*:-- మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనకు కూడా జరుగుతుంది. అందువలన తమమంచి కోరుకునే వారు అందరికీ మంచి నే చేయవలెను.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి