5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

సత్యనారాయణ స్వామి వారి వ్రతం

 *సత్యనారాయణ స్వామి వారి వ్రతం లో చేసే పొరపాట్లు..* 


---చాగంటి వారి ప్రవచనం నుండి....

       సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనాాయణస్వామి వ్రతంలో ప్రధానమైన అంగం మంటపదానం చేయడం. మొట్టమొదట స్కాందం లో ఒక షరతు ఉంది. మీ శక్తికి లోటు చేయకుండా మీరు సువర్ణమూర్తిని గానీ, రాగిమూర్తిని కానీ ఏదో ఒకటి పెట్టాలి. మనం ఎప్పుడూ ఏమి చేస్తామంటే .... ఒక కలశ పాత్ర పెట్టీ సత్యనారాయణ స్వామివారి ఫోటో తీసుకువచ్చి అక్కడపెట్టి వ్రతం చేసేసిన తరువాత చివరలో మంటపదానం చెయ్యమని మంటపమున్న తువ్వాలును కొద్దిగా ఎత్తమంటారు. ఎత్తిన తరువాత అందులో ఉన్న బియ్యము, తువ్వాలు పురోహితుని కి ఇచేస్తాము. ఇంకా కొంతమంది ఐతే ఇంటికి వచ్చినవాళ్ళు చూడాలని మంటపంలో ఒక వెండి అష్టలక్ష్మీ చెంబు పెడతారు. .... అష్టలక్ష్మీ చెంబును, మంటపంలో పెట్టీ పూజ చేసిన స్వామివారి మూర్తిని వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటా రు. నీవు మంటపంలో మూర్తిని పెట్టీ పూజ చేసిన తరువాత మంటపాంతర్గతంగా ఉన్న మూర్తిని కూడా నీవు దానం చేసెయ్యాలి. నువ్వు దానం చేశానని చెప్పి దానిని మరల ఇంట్లో పెట్టుకుంటే వెంటనే పొరపాటు చేసినట్లే. 

          అలాగే సత్యనారాయణ స్వామీ వ్రతంలో గ్రహములను పిలుస్తాము. పిలిచినప్పుడు ఆయన ఒక రంగు బట్టలు కట్టుకుంటారు. ఒక వాహనం ఎక్కుతాడు. కొన్ని ఆభరణములు వేసుకుంటాడు. ఆయనతో బాటుగా ఆయన పరివారం వస్తుంది. వాళ్ళు వస్తున్నప్పుడు ధ్యాన శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములలో ఉన్న శబ్దశక్తికి ఆ గ్రహములు వచ్చి కూర్చుం టాయి. అపుడు మంటపంలో సత్యన్నారాయనుడు వచ్చి కూర్చుంటాడు


. ఆఖరున కథ చెపుతారు. కథ మార్చడానికి వీల్లేదు. 


కథలో ప్రారంభంలో ముందు వ్రతమును బ్రాహ్మణుడు చేస్తాడు. అక్కడికి మంచినీళ్ళ కోసమని ఒక శూద్రుడు కట్టెలు కొట్టుకునేవాడు వస్తాడు. దాహం కోసమని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానము చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు. మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి కట్టెలు అమ్మిన డబ్బుతో వ్రతం చేస్తాడు. ఇద్దరికీ ఫలసిద్ధి కలుగుతుంది. చాతుర్వర్ణ ములవారు ఎలా ఈశ్వరుని పాదములు చేరుకో వాలో కథలో రహస్య మంతా అంతర్భాగం గా ఉంటుంది. 


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: