*_🌴 'పరోప కారాయ పుణ్యాయా, పాపాయ పరపీడనం' ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. అపకారం తలపెడితే పాపమే వస్తుంది. నీవు నీ స్వలాభం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేసి, బాధపెట్టి, హింసించి, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుష్కరాలు చేసినా నీ పాపాలు పోవు సుమీ!! ప్రాయశ్చిత్తం అనేది తెలియక జరిగిపోయిన తప్పుకే తప్ప పదే పదే చేసే తప్పులకు కాదు.. అంగడిలో వస్తువులు కొన్నట్లు, దేవుణ్ణి పూజలు, కానుకలు ఇచ్చి కొనలేం!! మనస్సులో మంచి చేయాలనే ఉద్దేశ్యం లేనపుడు ఎన్ని పూజలు చేసినా, ఎంత సాధన సలిపినా ప్రయోజనం ఉండదు.. పరుల నిమిత్తం నీవు ముందుకు కదిలినపుడు, నీ నిమిత్తం భగవంతుడు కదిలి వస్తాడు. కనుక నీలోని మంచిని పెంచుకో, చెడును త్రుంచుకో..🌴_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి