*కుటుంబమే మనిషికి బలం..!!*
కుటుంబమే మనిషికి బలం
కలిసి ఉండడమే ఆనందపు నిలయం
వచ్చిపోయేవారు స్నేహితులైతే
కడవరకు నిలిచిపోయేది కుటుంబమే..
కుటుంబం అందరినీ కట్టిపడేస్తూ
ఆనందాల తో అందలం ఎక్కిస్తూ
రాగద్వేషాలను సమానంగా పంచుతూ
బాధ్యతాయుత జీవితాన్ని పరిచయం చేస్తుంది..
సకల సుఖాలకు నిలయం
ఆత్మీయ అనురాగాలకు అదే మూలం
కుటుంబమే మానవ వ్యవస్థకు ఆదర్శం
అనుభూతులను పంచుకునే మధుర ఫలం...
వృద్ధాప్యపు అనుభవాల విజ్ఞానం
భార్యాభర్తల అనురాగపు మమకారం
పిల్లలందరి మధ్య విరబూసే ఆనందం
అందరినీ కలిసి ఉంచే ఐక్యపు చిహ్నం...
మనిషి ఆశల పందిర్లకు కాసినదే కుటుంబం
నీడనిచ్చే చలవరాతి దేవాలయం
అమ్మ ప్రేమను సజీవంగా అనుభవిస్తూ
నాన్న చిటికెన వేలుతో లోకాన్ని చూస్తుంది...
రక్తసంబంధంతో ముడి వేసే బంధం
కడుపులో ప్రేగుల్లా కలిసి ఉంచే అనుబంధం
తల్లి గర్భంలో చలివేంద్రంలా చూసుకుంటూ
వావి వరుసల పిలుపుతో పలుకుల మాధుర్యం..
అనుభవించ గలిగితే భూమిపై స్వర్గం
ఇంట్లో నే వెలిసిన కల్పవృక్ష ఛాయలతో
కామధేనువు వరాల అనుగ్రహముతో
కన్నీటి చుక్కలను తుడిచే ప్రయత్నం చేస్తుంది..
బంధములో బలం సంపూర్ణంగా ఉంటే
శేష జీవితం మనోహర సుందర రూపం
కుటుంబ పునాదులు పటిష్టంగా నిర్మిస్తే
శాశ్వతంగా ఆ కుటుంబ సౌధం నిలుస్తుంది..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి