*భగవంతుని నామ స్మరణ సకల దుఃఖ నివారిణి*
*ఎట్టి ఉపాయము తోచని స్థితిలో మనసు నిండుగా భగవంతుని తలిచి చూడండి, ఏదో ఒక రూపంలో పరిష్కారమును గ్రహించడం... తప్పక అనుభవంలోకి వస్తుంది.*
*వేకువనే లేచి భగవంతుని స్మరించుటవలన ఆ దినమంతయు శుభమే కలుగుతుంది. సాధన చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద అరణ్యంలో దారిని చూపుటకు చిన్న దీపం చాలు కదా! అలాగే మన జీవితానికి సరైన దారిని చూపుటకు భగవంతుని నామ స్మరణ అనే చిన్న సాధన చాలును. దీనికి తోడు సేవ అనేది మనము ప్రయాణించిన దారిని శుభ్రం చేయుటకు సహకరిస్తుంది.*
*కలియుగములో మానవజన్మ సార్థకతకు, మోక్ష సాధనకు అతి సులువైన మార్గం... భగవంతుని నామ స్మరణ దీన జనసేవయే. నేటి పరిస్థితుల్లో వీటికి మించి సులువైన ఉపాయం మరొకటి లేనే లేదని చెప్పాలి.*
*ప్రతిరోజు 30 నిమిషాలు పరమాత్ముని మీద ప్రేమతో ధ్యానం... చేద్దాం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉందాం.*
https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd
*┅━❀꧁ శ్రీ మద్భగవద్గీత ꧂❀━┅*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి