"" నా "" అనే స్వార్ధం నుండి ""మనం"" వైపు...
"" మాది "" అనే స్వార్ధం నుండి "" ""మనది"" అనే వైపు...
""మనకెందుకులే"" అనే స్వార్ధం నుండి.. ""మనకోసం"" మనం!! వైపు!!
""నేను""బాగున్నా.. వాళ్ళగురించి మనకెందుకు?? అనే భావం నుండి
వాళ్ళు బాగుండాలి!! నేను బాగుండాలి!! మనం బాగుండాలి!!
ఏ.. విద్య అయినా కానివ్వండి... దానిలో.. ప్రావీణ్యం సాధించాలి!!
దానికి అందరూ సహకరించాలి!!
ఏ విద్య నేర్చినా... నీ సనాతన విద్య వదలరాదు!!ఖచ్చితంగా సనాతన విద్య వైదిక విద్యలో... కూడా అవగాహన..పెంపొందించుకోవాలి!!
అగ్రహారాలు, మన కాలనీలో కనీసం వారానికి ఒక సమావేశం పెట్టుకొని.. మన సాధక.. భాధకాలు పాలు పంచుకోవాలి!!
ఆనాటి కాలంలో ఇంటి బ్రహ్మ ఉండేవారు!!
రాను రాను ఇంటి బ్రహ్మలులేరు!!
ఖచ్చితంగా ప్రతీ ఇంటికి ఖచ్చితంగా స్థిర ఇంటి బ్రహ్మ అవసరం!!
ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బ్రహ్మ ను మార్చరాదు!!
వారానికి ఒక్కసారి అయినా స్థానిక దేవాలయం సకుటుంబంగా దర్శించుకోవాలి!! ప్రతీ బ్రాహ్మణుడు ఖచ్చితంగా ప్రవర, సంధ్యావందనం వచ్చి ఉండాలి! స్థానిక పురోహితులు ఈ కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహించాలి!!
సంవత్సరానికి ఒక్కసారి అయినా పుట్టిన ఊరు లో.. దేవాలయ దర్శనం తప్పనిసరి!!
బఫె విధానం పూర్తిగా.. బ్రాహ్మణ వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది!!
కేటరింగ్ వ్యవస్థలో ఇతురులు ప్రవేశించాకా.. మడి విలువ పోయింది!!
యజ్ఞ యాగాదులు.. పురాతన విధానం ఎలా అనుసరణ చేస్తున్నామో..
ఆయా వైదిక పెద్ద క్రతువుల సంతర్పణలో పూర్వ ఆచారమే శ్రేష్టం!!
మీ.. విధేయుడు,
మీ.. మిర్తిపాటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి