12, జులై 2025, శనివారం

ఉద్ధరిస్తుంది

 03. అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ॥ దరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||


9


టేక:- (తల్లీ జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము) అవిద్యానాం = అజ్ఞానులకు, అంతస్తిమిర = లోపల వున్న (అజ్ఞానమను) చీకటికి, మిహిర ద్వీపనగరీ = సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, జడానాం = అలసులకు, మంద బుద్ధిగలవారికి, చైతన్యస్తబక = జ్ఞానమను పుష్ప గుచ్ఛమునుండి వెలువడు, మకరంద స్రుతి ఝరీ = నిరంతర చైతన్యధారగా వెలువడు తేనె ధారల ప్రవాహము, దరిద్రాణాం = దరిద్రుల పట్ల, చింతామణి గుణనికా = చింతామణుల వరుస (పేరు) జన్మజలధౌ = సంసార సముద్రము నందు, నిమగ్నానాం = మునిగి సతమతమగు వారి పట్ల, మురరిపు వరాహస్య = విష్ణుమూర్తి ఎత్తిన ఆది వరాహ అవతార మూర్తి యొక్క దంష్ట్రా భవతి = కోరవంటిది అగుచున్నది.


తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల - సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల - జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల - చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహపు కోరవంటిది. (వరాహమూర్తి ఈ కోరతోనే సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్దరించి సంరక్షించెను).


జగన్మాతా! నీ పాదంపై నున్న ఒక్క రేణువు అజ్ఞానమనే వ్యాధికి పరమౌషధం. తిమిరాంధకారంలో ఉన్నవారికి నీ పాదరేణువు సూర్యకాంతి వలె దారిచూపుతుంది. నీ పాదరేణువు జడత్వంతో ఉన్న వారికి ఆత్మ ప్రభోదాన్ని, దరిద్రులకు ఐశ్వర్యాన్ని, ఈ భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరాహావతారంగా ఉద్ధరిస్తుంది.


అమ్మా! నీ పాదకమలపరాగరేణువు ఉన్నదే! అది అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారికి సూర్యుడు ఉండే పట్టణము. మందబుద్ధులకు చైతన్యమనే కల్పవ కల్పవృక్ష పుష్పగుచ్ఛముయొక్క తేనె. దరిద్రుడి పాలిట చింతామణులప్రోగు. ప్రోగు. సంసార సాగరంలో మునిగిపోతున్న వాడికి యజ్ఞవరాహరూపియైన విష్ణువుయొక్క కోర.


12:25 PM

కామెంట్‌లు లేవు: