*కాలం పరీక్షలు నిత్యం పెడుతుంది...!!*
కామా లే కానీ పుల్ స్టాప్ పడని నడక
సాగిపోతుంది ఒడిదుడుకుల నావలా
గంభీరమైన ఆకారాలు నన్నే చూస్తున్నాయి
గతితప్పి యాడ పడిపోతానని ఆత్రుతతో...
కూర్చునే కొమ్మను నరుక్కుంటారా
లేత చిగుర్ల కోసం ఎదురు చూడాలి
బంగారు భవిష్యత్తును నిర్మాణం గావించి
అందులో అదృశ్యవంతుడి గానే ఉండాలి..
కాలం పరీక్షలు నిత్యం పెడుతుంది
సరైన సమాధానం కోసం వెతుకుతూ
లోక అనుభవాలను పంచుకుంటూ
ఎడారిలో వసంతం కోసం సాగిపోవాల్సిందే..
మనకు ఎవరూ వడ్డించి ఇవ్వరు
జ్ఞానం అనే పాయసాన్ని స్వీకరిస్తూ
అక్షరపు వెలుగుల దారుల్లో
చిమ్మ చీకట్లోనూ నడవగలగాలి..
చుట్టూరా అంధకారం కమ్ముకున్న
పాతాళంలో రత్నం ఆకర్షిస్తుంది
దాన్ని సాధించేందుకే ఈ ప్రయాణమంతా
జీవమున్నంతవరకు సాగుతుంది...
నాకంటూ ఒక కాలం నిర్ణయించబడుతుంది
ఆదరిస్తే అక్షర సౌధంలో రాయినైత
నిలబడగలిగితే గుడిలో విగ్రహంగా
లేదా గుడి బయట బండరాయిలా ఉంటా..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి