9, ఏప్రిల్ 2026, గురువారం

శరీరే జర్జరీ భూతే,

  *శ్లోకం* :

శరీరే జర్జరీ భూతే, వ్యాధిగ్రస్తే కళేబరే |

ఔషధం జాహ్నవీతోయం, వైద్యో నారాయణో హరిః || 

 *తాత్పర్యం:* 

శరీరం ముసలితనంతో లేదా అనారోగ్యంతో వ్యాధిగ్రస్తమై, బలహీనపడి (జర్జరీ భూతే) కళేబరంలా (మృతతుల్యంగా) మారినప్పుడు, అటువంటి సమయాన పవిత్రమైన గంగాజలమే (జాహ్నవీ తోయం) గొప్ప ఔషధం. అప్పుడు సర్వరోగ నివారకుడైన శ్రీమన్నారాయణుడే (హరి) నిజమైన వైద్యుడు.

నిద్రా విద్రావక ద్రావణం"*

 

*"నిద్రా విద్రావక ద్రావణం"*

("టీ" కి మా గురువుగారు పెట్టిన పేరు)


శా॥

నిద్రాభంగకరీ మనస్సుఖకరీ! మాధుర్యరూపోజ్జ్వలీ

ప్రాతస్సంగవమధ్యకాలరుచిమచ్ఛేషద్వయే శ్రీకరీ

చిత్తభ్రాంతిశమంకరీ ధృతికరీ ద్రావాకృతీ భూరి *"టీ"*

క్షీరశ్శర్కరపత్రచూర్ణవిలసద్యేకాక్షరీ నౌమి తే॥

*~శ్రీశర్మద*


పగటి కాలములు ఐదు 

ప్రాతఃకాలము 

సంగవకాలము 

మధ్యాహ్నము 

అపరాహ్నము 

సాయంకాలము

పంచాంగం 09.04.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 09.04.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష సప్తమి తిథి బృహస్పతి వాసర పూర్వాషాఢ నక్షత్రం పరిఘ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 77*


*ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాంకురేణ కామాక్ష్యాః।*

*పశ్యామి నిస్తులమహో పచేలిమం కమపి పరశివోల్లాసమ్॥*


*భావము :*


*అమ్మా! నీ దయ ఒక దీపశిఖ వంటిది. ఆ దీపపు వెలుగులో, ముజ్జగములలో సాటిలేని, పరిపూర్ణస్వరూపమైన పరదేవతను నేను తిలకించ గలుగుతున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


 

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।

మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।



ప్రతిపదార్థ:



ఇంద్రియాణి — ఇంద్రియములు; పరాణి — ఉన్నతమైనవి; ఆహుః — అనబడును; ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే; పరం — ఉన్నతమైనవి; మనః — మనస్సు; మనసః — మనస్సు కంటే; తు — కానీ; పరా — ఉన్నతమైనది; బుద్దిః — బుద్ధి; యః — ఏదైతే; బుద్ధే — బుద్ధిని మించి; పరతః — మరింత ఉన్నతమైనది; తు — కానీ; సః — అది (ఆత్మ).



తాత్పర్యము : 



స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.



  వివరణ:


ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ.


ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

09-04-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు. 

---------------------------------------


వృషభం


స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


మిధునం


సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

---------------------------------------


సింహం


తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

---------------------------------------


కన్య


నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

---------------------------------------


వృశ్చికం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------


ధనస్సు


వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------


మకరం


సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


కుంభం


కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం


కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

ఆయుర్వేద మూలికలు

 ప్రతి గృహము నందు ఉండదగిన ఆయుర్వేద మూలికలు మరియు ఆవరణలో ఉండవలసిన చెట్లు -


ఇప్పుడు నేను మీకు తెలియచేసే మూలికలు మరియు చెట్లు అందుబాటులో ఉండే విధముగా చూసుకోనవలెను . అలాగే మీ గృహావరణలో నేను చెప్పబోయే చెట్లను పెంచుకోవడం చాల మంచిది . ఒకవేళ మీ గృహవరణలో స్థలం లేకున్నచో మీకు దగ్గర ప్రదేశాలలో ఖాళీస్థలం ఉన్నచో ఈ చెట్లను పెంచడం మంచిది . వీటివల్ల ఎన్నో గొప్పగొప్ప ఔషధ యోగాలు ఉన్నాయి .


గృహము నందు ఉండదగిన మూలికలు -


నిమ్మకాయ , అల్లం , జీలకర్ర , సైన్ధవ లవణం , ఉప్పు , వాము , కురసాని వాము , ఇంగువ , సున్నము , బెల్లము , తేనె , ఆవునెయ్యి , నువ్వులనూనె , కుంకుడు కాయలు , వాము పువ్వు , పుదీనాపువ్వు , పచ్చ కర్పూరం , కర్పూరం , తెల్ల ఆవాలు , ఆవాలు , ఆముదము , యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క , గసగసాలు , సీమగొబ్బి విత్తనాలు , మిరియాలు , ధనియాలు , సుగంధపాల , గంధపుచెక్క , కస్తూరి , దుప్పికొమ్ము , అక్కలకర్ర , అతిమధురము , యష్టిమధుకము , కరక్కాయ , పిప్పళ్లు , పెద్ద ఉశిరిక పప్పు , పటిక , శొంటి , పటికబెల్లము , నీరుల్లి , వెల్లుల్లి , దుంపరాష్ట్రము , మోడీ , మోదుగ మాడలు , రుద్రాక్షలు , అరటిపండ్లు , తమలపాకులు , పసుపు , వాము , తేనె మైనం మొదలైనవి .


గృహ అవరణలో పెంచదగిన చెట్లు -


నిమ్మ , నారింజ , వేప , వెలగ , ములగ , ఉత్తరేణి , తెల్ల గురువింద , నందివర్దన , మందార , తెల్ల జిల్లేడు , నల్ల ఉమ్మెత్త , అవిశ , అరటి , పనస , తెల్ల ఈశ్వరి , మారేడు , ఉడుగ , దిరిశన , తుమ్మ , గరిక , తుమ్మి , చంద్రకాంత , గన్నేరు , తోటకూర , గోంగూర , బచ్చలి , చిత్రమూలం , సరస్వతి , చిర్రి , మోదుగ , నల్లేరు , కాడజెముడు , దూలగొండి , వెంపలి , పుదినా , వాము , తులసి , కొబ్బరి , జీడిమామిడి , కానుగ , పిప్పిలి , టేకు , వెదురు , జాజి , గులాబి , మల్లె , దానిమ్మ , పెద్ద ఉశిరిక , మేడి మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను .


పైన చెప్పినటువంటి ఔషధాలు మరియు ఔషధ చెట్ల గురించి నేను రాసిన మూడు ఆయుర్వేద గ్రంథాలలో విపులంగా వివరించాను.




ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - సప్తమి - మూల -‌‌ గురు వాసరే* (09.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జానకీ వల్లభా

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా !  సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని  నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము  జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె  నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి  పిరాట్ల