26, జూన్ 2025, గురువారం

హక్కేది

 😱     *హక్కేది?*   😱



కం.

ప్రేమోన్మత్తులు కొందఱు 

కామోన్మత్తులు నితరులు కౌమారమ్మో 

కామాంధతయో పూనగ 

ప్రేమించుట మాని చంపు విధిలో మునిగెన్ 


కం.

తల్లిని జంపెడు వారొక 

రల్లుని జంపును మరియొక రాత్మజు నొకరున్ 

పెళ్ళాడిన పతి నొకరును 

చల్లగ జంపుట సులువయె సాటిమనుజులన్ 


కం.

హక్కేదిక్కడ చింతిల 

చక్కని ప్రాణము నడపగ సాటిజనులకున్ 

ఒక్కని కుసురును పోయగ 

హక్కే లేనట్టి వారి కారయ పృథివిన్ 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: