శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయే నమః
గురువిజ్ఞాననిగూఢం - ఆషాఢం
ఆషాఢమాసాన్ని విజ్ఞానమాసమనీ, గురుస్వరూపమనీ పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీ హరి కృప అత్యంత వేగంగా భక్తులపై ప్రసరించే దివ్య మాసం ఆషాఢం అని మహాభారతం చెబుతున్నది. ఆషాఢం పురాణ మాసం.
*ఆషాఢమాసంలో శివాలయంలో ధూపం వేసిన వారికి భయంకర దారిద్ర్యం తొలగి సంపదలు లభిస్తాయి.*
పితృదేవతలకూ, దేవతలకూ, మునులకూ కూడా అత్యంత ప్రీతిపాత్రం ఆషాఢం. మోక్షమార్గానికి ప్రథమ సోపానం ఆషాఢం. ముందుగా ఈ మాసంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. దానివల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల సద్గురు కటాక్షం లభిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత గాథ పద్మపురాణంలోని సృష్టి ఖండంలోని 9వ అధ్యాయంలోను, మత్స్యపురాణంలోని 14వ అధ్యాయంలోనూ ఉంది.
*ఆషాఢమాసంలో బిల్వ వృక్షాన్ని నాటినా, బిల్వవనానికి నీరు పెట్టినా, బిల్వ పత్రాలతో రుద్రార్చన చేసినా శివగణంలో స్థానం లభిస్తుంది. ఆషాఢంలో తులసి పూజ చేసినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తులసి మెుక్కను పూజించి, ఆ మెుక్కను దానం చేయడాన్ని తులసి పూజ అంటారు. మెుక్కను ముత్తైదువులకు మాత్రమే దానం చేయాలి. ఆషాఢం అనేక విధాలుగా విజ్ఞానాన్ని, శాంతిని ప్రసాదించే మాసం .ఈ మాసాన్ని సద్వినియెాగం చేసుకున్నవారు గురుస్థానం పొందుతారు.*
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )
https://youtube.com/watch?v=is155gP9ayA&feature=share8
ఆషాఢ విదియ
ఆషాఢ విదియ రోజు పురి జగన్నాథ ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. అత్యద్భుతమైన జగన్నాథ ఆలయం ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్ప బలం వల్ల ఏర్పడింది. గజేంద్రమోక్షణంలో గజరాజుగా ఉన్నది ఇంద్రద్యుమ్న మహారాజే. ఆయన్ని అనుగ్రహించి జగన్నాథ పురం అనే ఒక ఊరును మహానుభావుడు శ్రీమన్నారాయణుడు పూర్వ సముద్ర తీరంలో ఏర్పాటు చేసి అక్కడ జగన్నాథుడయ్యాడు. జగన్నాథుడు సుభద్ర, బలరాముడితో కొలువై ఉంటాడు.
ఆచరించవలసిన విధివిధానాలు:
ఏదైనా ఒక *ఆలయంలో* కానీ లేదా *మహానుభావులుండే స్థలానికి కానీ వెళ్లి చీపురుకట్ట పట్టుకొని ఊడవాలి. నేలని శుభ్రం చెయ్యాలి.*
గురుసేవ, మహాత్ముల సేవ, ఆలయ సేవ, సేవకుడు లాగా, దాసుడి లాగా, ఒక కింకరుడి లాగా చెయ్యాలి.
*ఫలశ్రుతి*- మహా ఐశ్వర్య సంపన్ను డవుతాడు.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి