హరిహరనాధుడు-తిక్కన.
శ్రీయనగౌరినాబరగు చెల్వకుఁజిత్తముబల్లవింప భ
ద్రాయతమూర్తియై హరిహరంబగురూపముఁదాల్చి విష్ణురూ
పాయనమశ్శివాయ యనిగొల్చెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చుపరరూపముగొల్తు నభీష్ఠ సిధ్ధికిన్!!
ఆం-మహాభారతం-విరాట ప్రారంభపద్యం!
తిక్కన శివకేశవాభేదవాది.తన సమకాలంలో విజృభించే శైవ వైష్ణవ మతముల ఘర్షణ నణగింపనెంచి యతడు హరిహరనాధుని నెలకొలిపి ,హరిహరాద్వైతమును ప్రచారమొనరించెను.తద్వారా చేతనైనంతమేరకు మతఘర్షణలనణగింపయత్నించెను.అతని ఫలించెనోలేదో తెలియదుగాని నాటి యతని సామాజిక సంస్కరణ దృష్టికిప్రతీకగా ఈపద్యము హరిహరాభేదసూచకమై ఆంధ్రవాఙ్మయము నలంకరింపజేసినది.
ఇందు శివకేశవాభేదము ప్రస్ఫుటముగా ప్రతిపాదింపబడినది.
స్వస్తి!🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి