15, ఆగస్టు 2020, శనివారం

రామాయణమ్....31



సర్వలోకమనోహరుడైన రాముని వివాహక్రియ జరిపించండీ
ఓ ప్రభూ !ఓ మహర్షీ !
అని జనకమహారాజు వశిష్ట మహర్షిని కోరగా !
.
"రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో! "
.

సీతాకళ్యాణ వైభోగమే !రామ కళ్యాణ వైభోగమే!
.
అందుకు అంగీకరించిన వశిష్టమహర్షి విశ్వామిత్ర,శతానందులను ముందిడుకొని అగ్నివేదిక నిర్మించాడు.
.
తరువాత జనకమహారాజు తన కూతురు సీతను సర్వాలంకారభూషితను అగ్నిసాక్షిగా రాముని ఎదురుగా ఉంచి
.
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా.
.
ఇదిగో! నా కుమార్తె అయిన సీత ! ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు ఈమెను స్వీకరింపుము నీ చేయితో ఈమె చేయి పట్టుకొనుము (పాణిం గృహ్ణిష్వ పాణినా అనగా చేయిచేయికలుపుట ,ఇదీ మన సంప్రదాయము).
.
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా!
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా .
.
మహాభాగ్యవంతురాలగు ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలము వదిలాడు జనకుడు.
.
అదేవిధంగా మిగిలిన మువ్వురు రాజకుమారులకు వివాహం జరిగింది !.
.
శ్రీ రామచంద్రుడి వివాహము ఘనంగా జరిగింది ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు!
.
వివాహము అయిన తరువాత నలుగురుకొడుకులూ ముందుభార్యలతో వెడుతుండగా దశరధుడు వెనుకనుండి వారిని చూస్తూ మహదానంద పడ్డాడు.
.
సీతారాముల వివాహమయిన తరువాత అందరి వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
.
N.B..
.
అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్తుగా ప్రవేశపెట్టాడో అంతే హఠాత్తుగా ఉపసంహరించాడు వాల్మీకిమునీంద్రుడు !
ఆయన తన యాగ రక్షణ తాను చేసుకో గలడు తాటకి తాటతీయగలడు! .
కానీ !
రాబోయే రోజులలో ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉన్న రాముడికి సకలశస్త్రాస్త్ర జ్ఞానమివ్వాలి రాముడికి గురువు అని అనిపించుకోవాలి ! అదీ ఆయన తపన ! నిజానికి విశ్వమిత్రుడికన్నా గొప్పగా యుద్ధవిద్యలు తెలిసిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడు ! మహావిష్ణువు ,మహాదేవుడు తప్ప!
.
రావణ వధ జరగాలంటే  రాముడిపెళ్ళి కావాలి ! ఇది చాలా ముఖ్యం .
అందుకే రెండు ముఖ్యమైన పనులను తానే స్వయంగా దగ్గరుండి నిర్వర్తించాడు మహర్షి !
.
అదీ విశ్వామిత్రుడు అంటే ! లోకకళ్యాణం కోసం తపించే మహానుభావుడు! అంతేగాని కోపిష్టి వాడు విశ్వామిత్రుడు కాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**************

కామెంట్‌లు లేవు: