6, ఆగస్టు 2020, గురువారం

భక్తి భావాన్ని పెంచే గంటానాదం

*మన ఇంటికి సమీపంలో ఉన్న దేవాలయం నుంచి గంటానాదం మనకు ఎప్పుడూ వినిపిస్తూవుంటుంది. ఈ శబ్దం వినేవారికి భక్తి భావాన్ని పెంచుతుంది. నేటికి కొన్ని గ్రామాల్లో ఎడ్లు, ఆవులు మెడలో గంటలు కడతారు. ఈ గంటల చప్పుడు ఎంతో రమనీయముగా ఉండి మన సంప్రదాయ భావాలను గుర్తు చేస్తూ ఉంటుంది. దేవాలయాల నుండి వెలువడే వివిధ స్థాయిల్లో ఉండే గంటల శబ్దం " ఓం కారాన్ని"  స్ఫురింపజేస్తుంది అని పరిశోధకులు వెల్లడించారు. గంట శబ్ద తరంగ రూపంలో వ్యక్తమై క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అది నాదమై "ఓం కారాన్ని" వినిపిస్తూ మనసును ఎంతగానో ప్రేరేపిస్తుంది. శంఖారావంతో కూడిన గంటానాదం భక్తుల మదిలో భక్తి భావాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ నాదం ఏకాగ్ర శక్తిని పెంచుతుంది.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....

కామెంట్‌లు లేవు: