23, ఆగస్టు 2025, శనివారం

శనివారం 23 ఆగస్టు 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁శనివారం 23 ఆగస్టు 2025🍁*

                      4️⃣0️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


        *పిండోత్పత్తి క్రమం*                

```

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి 'కలిల'మై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు 'బుద్బుద' మై (బుడగ), పదవ దినానికి రేగు పండంత అయ్యి. ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు - చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదుల వల్ల తృప్తిని పొందుతాడు.


ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్చలేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచెం సుఖం కూడా లేకుండా ఉంటాడు.


ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధన రూపములైన సప్త ధాతువులతో బద్దుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు తాను ఎవ్వనిచే గర్భవాసవ క్లేశాన్ని అనుభవించడానికి నియమించబడ్డాడో ఆ సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు. ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడైన జీవుడు గర్భం నుండి బయటకు రాకుండా తొమ్మిది మాసాలు గడుపుతాడు. ఆ తరువాత పదవ మానం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్స్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్ధం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, అనేక పురుగులతో కూడిన ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన: శ్రీ వనం*

    *జ్వాలా నరసింహారావు*

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: