*జీవితంలో నిత్య సత్యమైనాదానిని విశ్వసించాలి!!*
నిత్య జీవితంలో సత్యమైనది, మార్పు లేనిది, ఒక్క దైవం మాత్రమే, ఆ దైవాన్ని విశ్వసించాలి మనం!!...
పరిపూర్ణ మైన జీవితాన్ని గడపాలి అంటే, ముందు ఆయన గురించి అన్వేషించాలి,
మానవత్వం లో ఎంతో విచిత్రమైన శక్తి ఉన్నది,
భగవంతుని సృష్టి యే మహా విచిత్రమైనది.
ఒక మానవుని వలె మరొక మానవుడు లేడు.
ఒక వేలి ముద్ర వలె మరొక వేలి ముద్ర లేదు.
అంతా విచిత్రంగా ఉంటున్నది...
భగవంతుని సృష్టి ఒక మౌల్డ్ తో చేసేదికాదు, లేక ఒక రబ్బరు స్టాంపు తో చేసేదికాదు.
ఇది క్షణ క్షణంమునకూ మారేటి వంటిది.
విభిన్న మైన రూపనామములను ధరించేటటువంటిది,
కవలపిల్లలయందు కూడా, ఏదో వ్యత్యాసం ఉండే తీరుతుంది.
ఇంత విచిత్రమైనది భగవత్ సృష్టి.
మన హృదయంలో భగవంతుడు తప్ప మరొకడు ఉండకూడదు,
భార్యా భర్తల మధ్య, తల్లీ పిల్లల మధ్య, అన్న దమ్ములమధ్య ఉండేది దేహ సంబంధమే కానీ హృదయసంబంధముకాదు.
ఈసంబంధాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే!
నీవు పుట్టక ముందు, పుట్టిన తరువాత మరణించిన తరువాత కూడా నీ వెంట దేవుడే ఉంటున్నాడు.
ఇతడుసర్వవ్యాపి , ఆయన లేని స్థలం ఉండదు.
కనుక ఇట్టి నిత్య సత్యమైన దైవాన్ని విశ్వసించాలి, అప్పుడే మానవ జీవితానికి ఒక సార్థకం చేకూరుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి