ఈరోజు *త్రిలోచనా అష్టమి*. శివపార్వతులను పూజించడానికి అనుకూలమైన రోజు. త్రిలోచన అంటే మూడు కన్నులు అని అర్థం. ముక్కంటి శివుడు కాబట్టి శివుణ్ణి ఆరాధించడానికి అనుకూలం అయిన రోజు. శివునిలో అర్ధభాగం పార్వతీ కాబట్టి,శివుని అంతర్ముఖ మూడవ కన్ను పార్వతీ దేవి అని నమ్మకం. దేశంలోని చాలా ప్రాంతాలలో జ్యేష్ఠ మాసంలో బహుళ పక్ష అష్టమి రోజున త్రిలోచన గౌరీ వ్రతం,త్రిలోచన పూజ జరుపుకుంటారు.నవమి రోజున కూడా త్రిలోచన నవమి పేరుతో రేపు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. త్రిలోచన గౌరీ వ్రతం లో మూడు ప్రధాన పూజలు ఆచరిస్తారు. అవి శివాభిషేకం,శివ పార్వతుల పూజ,ఉమా శివాగ్ని పూజ. దంపతులు తమ వైవాహిక,దాంపత్య జీవితం చక్కగా ఉండాలని ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
గురువారం రేవతీ నక్షత్రం కలయిక ఉండటం వలన *సర్వార్థ సిద్ది యోగం* ఈరోజు రాత్రి 11.17 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం.
*ఆకాశంలో చంద్ర శని నెప్ట్యూన్ గ్రహాలు అత్యంత చేరువ గా* ఉదయం 06.41 కి చేరుతాయి. మీన రాశిలో ఇంచు మించు ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ మూడు గ్రహాలు ఒకదానికి ఒకటి 2°58' డిగ్రీల కోణ స్థితి లో చేరువ అవుతాయి.
ఈ మూడు గ్రహాలు మన కంటికి ఈరోజు రాత్రి 12.56 కి 61° డిగ్రీల ఆగ్నేయ ఆకాశం లో కనిపించడం ప్రారంభం అయ్యి రేపు తెల్లవారి వెలుగు లో అంతర్ధానం అవుతాయి.
*చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం* ఈరోజు ఉదయం 09.27 కి జరుగుతుంది. మీన రాశిలో 0°07' డిగ్రీల ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ సమయంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 03°23' డిగ్రీల కోణ స్థితి లో చంద్ర గ్రహం చేరువ అవుతుంది.
ఈ రెండు గ్రహాలు మన కంటికి ఈరోజు రాత్రి 12.56 కి 61° డిగ్రీల ఆగ్నేయ ఆకాశం లో కనిపించడం ప్రారంభం అయ్యి రేపు తెల్లవారి వెలుగు లో అంతర్ధానం అవుతాయి.
...సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి