వావిళ్ళ కుటుంభీకులు కావేరి నది పరివాహిక ప్రాంతం నుండి 13 -14 శతాబ్దాలలో తెలుగు నేల పూడూరు నెల్లూరు జిల్లా , కాకరపర్రు పశ్చిమ గోదావరి జిల్లా , పేరూరు తూర్పు గోదావరి జిల్లా , దిమిలి విశాఖపట్నం జిల్లాకు వలస వచ్చిన వారు.
మనకు తెలిసిన ప్రముఖులు అవధానం పాపయ్య , (ఈస్ట్ ఇండియా కంపెనీ లో ప్రధాన పాత్ర ), చదలవాడ సీతారామ శాస్ట్రీ (పెద్ద బాల శిక్ష ), వేదం వెంకటరాయ శాస్ట్రీ , ఆదిభట్ల నారాయణ దాసు , కావ్యకంఠ గణపతి ముని , చిలకమర్తి లక్ష్మి నరసింహం , చెళ్ళపిళ్ళ వెంకట శాస్ట్రీ , అల్లాడి కుప్పుస్వామి , మామిడిపూడి వెంకట రంగయ్య , శ్రీ రంగం శ్రీనివాసరావు …..ఈ కుటుంభానికి చెందినవారు.
రామస్వామి శాస్త్రులు గారు తెలుగు సంస్కృత పండితులు. 1869 లో హిందూ బాషా సంజీవిని -సరస్వతీ నిలయం -ఆది సరస్వతీ నిలయం పేరున ముద్రణ సంస్థలు ప్రారంభించారు. తెలుగు సంస్కృతం లో ఏభై గ్రంధాలు ప్రచురించారు. 1891 లో మరణించారు.
వారి ఏకైక సంతతి వెంకటేశ్వర శాస్ట్రీ (1884 ) తెలుగు -ఆంగ్ల భాషలు చదువుకున్నారు. వారి హయాంలో వావిళ్ళ ప్రెస్ గా మార్పు చేసి గీత ప్రెస్ గోరఖ్ పూర్ , చౌఖంబా వారణాసి వారితో అనుసంధానించి గ్రంథ ప్రచురణ సలిపారు. కాలికో బౌండ్ లో రాయల్ , డెమీ ,క్రౌన్ సైజు లలో అప్పటి కాలములో తీసుకు వచ్చారు. ఫ్రెంచ్ పేరు De Lux పేరును ఉపయోగించారు.
తెలుగులో సంస్కృత బాషా గ్రంధాలు , సాంప్రదాయక సాహిత్యం , ఇతిహాసాలు , పురాణాలు , పరిశోధన గ్రంధాలు , విశ్లేషణలు , ముఖ్యముగా ప్రస్థానత్రయం ప్రచురణ చేశారు. సాధారణ తెలుగు భాషలో సంస్కృతము అందరు చదవగలిగిన సరళత్వం ఒక విశేషం. జాతీయ భావాలు కలిగిన వెంకటేశ్వర శాస్త్రులు బాల గంగాధర్ తిలక్ కు అనుయాయులు. బెంగాల్ విభజన పిమ్మట బంకిం చంద్ర ఛటర్జీ నవల ఆనంద్ మఠ్ తెలుగు అనువాదం ప్రచురించారు. సత్యమూర్తి -ప్రకాశం పంతులు గార్లకు స్వతంత్ర ఉద్యమం లో పలు మార్లు ఆర్ధిక సహాయం చేశారు.
త్రిలింగ వార పత్రిక (1916 ) లో ప్రారంభించి అక్కిరాజు ఉమాకాంతం గారిని ఎడిటర్ గా నియమించి జాతీయ వాదం ప్రచారం చేసి ఆంగ్లములో ఫెడరేటెడ్ ఇండియా 1927 లో వ్యాసా రావు గారిని ఎడిటర్ గా నియమించి నడిపించారు. సుబ్రమణ్య భారతి గారితో కలసి తమిళంలో బాల వినోదిని నెలవారీ పత్రిక నడిపించారు.
అప్పటి గొప్ప పత్రిక సంపాదకులు జి. సుభ్రమణ్య అయ్యర్ , CY చింతామణి లాంటి వారితో గౌరవ స్నేహ సంభందాలు ఉండేవి. ఆయన షష్ఠి పూర్తి వేడుక చాల ఘనంగా జరిపారు అందరు మిత్రులు కలసి.
తెల్లటి దోతీ , కోట్ , టర్బన్ , పై వస్త్రం దోతీ ధరించి మదన్ మోహన్ మాలవ్య ను గుర్తు చేసేవారు. ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబిలీ 1938 సెషన్ కు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవరించారు . పచ్చయప్ప కాలేజీ ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా ఉండేవారు. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ , కాస్మోపాలిటన్ క్లబ్ లతో అనుసంధానం ఉండేది.
సర్ శ్రీనివాస అయ్యంగార్ -గారితో స్నేహం ఉండేది.
శ్రీ నాధుని రచనల ప్రచురణలో అస్లిలం ఉందని( obscene)(పిఠాపురం రాజా , జయంతి రామయ్య మొదలగువారితో కోర్ట్ కేసు ఎదుర్కొన్నారు. వాత్స్యాయన కామ సూత్రాలు (పెద్దలకు మాత్రమే ) ప్రచురించి ప్రైవేట్ సర్క్యూలేషన్ కు విక్రయించారు.
1931 -1933 మధ్య కాలమున 18 మహాభారత సంపుటాలు ప్రచురించారు. అవి భండార్కర్ రీసెర్చ్ పూణే వారితో సమాన గుర్తింపు కలిగింది. కాశీ పండితులు శాస్త్ర ప్రచార భూషణ బిరుదు తో సత్కరించారు. 1955 న ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు తో సత్కరించింది.
కానీ అయన వివాహజీవితం సుముఖం కానందువలన వారికి సంతానం కలుగ లేదు. అది అప్రస్తుతం. పక్షవాతము తో మంచానపడి 1942 -1956 తన 67 వ ఏట మరణించారు. వీలునామా ఏమి రాయనందున వారి ఆస్తి పాస్తులు , ప్రచురణ సంస్థ నిలిచి పోయింది.
వావిళ్ళ వెంకటేశ్వర్లు శాస్త్రులు ఒక గొప్ప ప్రచురణ సంస్థ నడిపించి , జాతీయ వాదిగా , పరోపకారి గా జీవించి ఒక గొప్ప ప్రచురణ కర్తగా చరిత్రలో నిలిచిపోయారు.
ప్రస్తుతం మద్రాస్ (చెన్నై )తంబుసెట్టి స్ట్రీట్ లో వారి బుక్ స్టాల్ నడుపబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి