11, జూన్ 2025, బుధవారం

సకల కలావిభూషితులు

 శు భో ద యం 🙏



"సకల కలావిభూషితులు శబ్దవిదుల్ నయతత్వబోధకుల్ ప్రకటకవీంద్రు లేనృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా 

వికృతపుజాడ్య మా దొరది, విత్తములేకయ వారు పూజ్యు లం

ధకజన దూషితంబులు ఘనంబులు గావె అమూల్యరత్నముల్;

-సుభాషితత్రిశతి-నీతిశతకం.విద్యాపధ్ధతి-ఏనుగు లక్ష్మణకవి;


        నిరాశ్రయాః నశోభంతే పండితాః వనితాః లతాః"-అనిగదా మహనీయులమాట.ఎంతచదివినా ఉదరపోషణార్ధం ప్రభుసమాశ్రయణం చేయక తప్పదు.అలావిచ్చేసిన ఆపండితులను సమాదరించి పోషించటం ప్రభువులకర్తవ్యం. అలాకాక, సకలశాస్త్రకోవిదులైన పండితులు తనకడనున్నను వారి పోషణ విషయం శ్రధ్ధజూపకుండుట ఆప్రభుని దోషమగును.

ధనమున్నను లేకున్నను విద్యావంతులు పూజ్యులే! 

     గుడ్డివారు మెచ్చని మాత్రమున రత్నము రాయి కాదుగదా!దాని విలువ మారనిది.


విశేషాంశములు:

సరసుడైన విభుడు విజయనగర ప్రభువులు ఆనందగజపతులవలె విద్వత్కవుల పోషణనుపేక్షింపడు.

    అలట్లుగాక అల్పుడైన

గొబ్బూరి జగ్గరాజువలె కవులను పరాభవింపజూచిన ఫలితము ప్రమాదకరమగును.

     రత్నమురత్నమే రాయికాదని తాత్పర్యము.

                            స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: