11, జూన్ 2025, బుధవారం

ఏరువాక పూర్ణిమ

 *ఏరువాక పూర్ణిమ శుభాకాంక్షలు..*


*ఏరువాక పౌర్ణమికి స్వాగతం..*


జేష్ఠ పౌర్ణమికి నేలపై పండుగే

ఏరువాక పున్నమి రైతన్నకు పర్వం

ఏరులు వాగులు ఏకమై ప్రవహిస్తే

రైతన్న ఇంట ధాన్యలక్ష్మిని ప్రతిష్టించును..


నింగిలోని మబ్బులు నేల దారి పట్టి

ఎండిపోయిన నదులు ఏరువాక మురిసే

తొలి కారు పంటకు స్వాగతాలు పలికే

తొలకరి చినుకులు నేలపై కల్లాపి చల్లెను..


నెర్రెలు వారి నేలమ్మ ఏడ్చి ఎండిపోయే

తొలకరి తోడుతో తనువంతా మురిసిపోయే

బుర బురా పొందిన మట్టి పరిమళం వెదజల్లే

మల్లెపూల సువాసనలు చిన్నబోయి ముడుచుకునె...


రైతన్న ఇల్లాలు పశువులు అలంకరించె

పాడిపంటలు గల దేశంలో క్షీరసాగరం వెలిసే

పచ్చగడ్డి దొరికి పశువుల పరవశించే

తొలకరి వర్షానికి మురిసి యద పొదుగు పెరిగే...


పుడమిపై ఏరు,వాగు ప్రవాహాలు సాగితే

రైతన్న కష్టము చెమట రూపంలో వచ్చే

చేతి అంటిన మట్టి పరిమళం విరజిమ్ముతుంటే

కష్టమంతా మరిచి బురదలో లీనమై పోయే


విత్తనాలు కొనేందుకు రైతన్న అగచాట్లు

పెట్టుబడుల కోసం అప్పులకు తిప్పలు

నకిలీ విత్తనాలతో నమ్మకపు మోసాలు

మొక్క వచ్చేవరకు నేలపైనే చూపులు..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066235

కామెంట్‌లు లేవు: