*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*
*429 వ రోజు*
ఈ అకారణ కోపం వదిలి పెట్టు భీముడు తన ప్రతిజ్ఞా పాలన చెయ్యడం ఎలా అధర్మం ఔతుంది. అన్నయ్యా ! భీమసేనుడు సుయోధనుడు నిలబడి ఉన్నప్పుడు నాభి క్రింద కొట్ట లేదు అతడి క్రింద ఉండి సుయోధనుడు పైకి ఎగిరి గదతో భీముని చంపుటకు ప్రయత్నించే సమయంలోనే కదా తన ప్రతిజ్ఞా పాలన కొరకు పదమూడేళ్ళు వేచి ఉన్న భీముడు నాభిక్రింద కొట్టింది. అలా చెయ్యక పోతే భీమసేనుడు మరణించడా ! ఆపత్కాలంలో ప్రాణాపాయకాలంలో ధర్మాధర్మ విచక్షణ చేయడం కుదురుతుందా ! భీముని ప్రతిజ్ఞ తెలిసిన సుయోధనుడు తగిన జాగర్త ఎందుకు తీసుకో లేదు. అన్నయ్యా చిన్నతనం నుండి పాండవులను హతమార్చుటకు సుయోధనుడు చేసిన కుటిల ప్రయత్నాలు నీకు తెలియనివా ! కుటిలుడిని కుటిలోపాయంతో చంపడం అధర్మం కాదే ! మన చెల్లెలు కుమారుడైన అభిమన్యుడిని కుటిలోపాయంతో అధర్మంగా చంపిన సుయోధనుడిని చంపడంలో అధర్మం ఏమి ఉన్న దోషమేమి ! ధర్మానికి ధర్మం అధర్మానికి అధర్మం చెల్లుకు చెల్లు అధర్మాన్ని అధర్మం జయించింది " అన్నాడు. బలరాముడు " కృష్ణా ! నీ వాదనాపఠిమతో అధర్మాన్ని ధర్మం అని నిరూపించలేవు. నీ దృష్టిలో ఇలాంటి నీచమైన గెలుపు సాధించిన భీముడు నీకు ప్రశంశాపాత్రుడు ఔతాడేమో ! కాని యుద్ధనీతిని అక్షరాలా పాటించిన సుయోధనుడు ఉత్తమ లోకాలను పొందుతాడు " అని రథం ఎక్కి ద్వారకకు వెళ్ళి పోయాడు.
*చింతాక్రాంతుడైన ధర్మరాజును కృష్ణుడు ఓదార్చుట*
అప్పుడు శ్రీకృష్ణుడు చింతాక్రాంతుడైన ధర్మరాజు వంక చూసాడు. తల వంచుకుని చింతాక్రాంతుడై నిలబడి ఉన్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాపకర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఇందుకు బాధపడ వలసిన పని ఏమి " అని పలికిన కృష్ణుడిని చూసి ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరుగ కొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. కాని సుయోధనుడి తల తన్ని అవమానించడం న్యాయమా ! అసలే కురువంశ నాశనముకు నా మనస్సు విచలితమౌతుంది. భీముని చర్య నాకు అమిత దుఃఖం కలిగించింది. భీమసేనుడికి మేము పడిన కష్టాలు గుర్తుకు వచ్చి అలా చేసి ఉంటాడులే ! ఇప్పుడిక పాప పుణ్యాల ప్రసక్తి ఎందుకు " అన్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! కురువంశ వినాశకుడు అయిన సుయోధనుడు నేల కూలాడు. ఇప్పుడు నీవు సర్వంసహా కురు సామ్రాజ్యానికి నీవు చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడితో " నీ ధైర్యం, భుజబలం, శ్రీకృష్ణుడి సాయంతో సుయోధనుడిని నేల కూల్చిన నీకు నా అభినందనలు " అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.
*కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుట*
బలరాముని మాటలకు చింతాక్రాంతుడై చూస్తున్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాప కర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఇందుకు చింత పడటం ఎందుకు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరిచి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. అయినా సుయోధనుడి తల తన్నడం ఎందుకు. అసలే కురువంశ నాశనం అయినందుకు నా మనస్సు పరితాపం చెందుతున్న నాకు భీమసేనుడి చర్య అమిత బాధను కలిగించింది. భీమసేనుడికి తాను పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి అలా ప్రవర్తించి ఉంటాడులే. ఇక పాప పుణ్యాలను పోనీలే కృష్ణా ఆలోచించి ఏమి ప్రయోజనం " అన్నాడు. కృష్ణుడు " ధర్మ నందనా ! మీ అవమానాలకు కష్టాలన్నిటికీ కారకుడు కుల నాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు నేలకొరిగాడు. ఇక ఈ సర్వం సహా సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు " భీమసేనా ! నీ సాహసం ధైర్యం శ్రీకృష్ణుడి సహాయంతో సుయోధనుడిని నేల కూల్చావు. నీకు నా అభినందనలు " అన్నాడు. " అని సంజయుడు చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి