శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే (27)
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ (28)
పార్థా.. యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడి ప్రీతికిచేసే కర్మలన్నిటినీ సత్ అనే చెబుతారు. హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు—వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటివల్ల ఇహలోకంలోకాని, పరలోకంలోకాని ఫలితమేమీ వుండదు.
శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగయోగము అనే పదునేడవ అధ్యాయం సమాప్తం..🙏
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి