🔔 *తీర్థ యాత్ర* 🔔
తిరుమల తిరుచానూరు శ్రీకాళహస్తి కాణిపాకం యాత్ర ఎలా చేయాలి..?!* కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే జన్మధన్యం అయినట్టే అని భావిస్తారు. అందుకే ఏడాదికి ఓసారి కొందరు, ఏడాదికి రెండుసార్లు మరికొందరు, వీలు కుదిరినప్పుడల్లా ఇంకొందరు స్వామి సన్నిధికి క్యూ కట్టేస్తారు.అయితే తిరుమల వెళ్లొచ్చేవారిలో ఓ సందేహం ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ కథనం...
తిరుమల యాత్రాక్రమం ఏంటి?
ఎక్కడి నుంచి ప్రారంభించాలి?
ఏ క్షేత్రం మొదట దర్శించుకోవాలి?
కొండపైకి వెళ్లి స్వామిని చూసి కిందకు రావాలా?
తిరుమల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూసేసి కొండెక్కాలా?
ఈ ప్రశ్నలకు సమాధానంగా..తిరుమల యాత్ర 7 స్టెప్స్ లో చేయాలని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. అవేంటో చూద్దాం...
*కాణిపాకం*
తిరుమల యాత్ర కాణిపాకం నుంచి ప్రారంభించాలి. ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని తల్చుకుంటాం కదా. అలానే ముందుగా కాణిపాకం స్వామిని దర్శించుకోవాలంటారు. గణపతి ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి వెంటనే కరుణిస్తుందంటారు ఆధ్యాత్మిక వేత్తలు
*తిరుచానూరు*
అయ్యవారి కన్నా ముందు అమ్మవారిని ప్రశన్నం చేసుకోవాలి. అందుకే శ్రీవారి దర్శనం కన్నా ముందు తిరుచానూరు వెళ్లి పద్మ సరోవరంలో స్నానం ఆచరించి..పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి
*కపిలతీర్థం*
తిరుచానూరు నుంచి కపిలతీర్థం వెళ్లి అక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. అనంతరం అక్కడి నుంచి కొండెక్కాలి
*తలనీలాలు*
కొండపైకి వెళ్లాక ఇంకేముందు స్వామివారిని దర్శించుకుంటే చాలు అనుకోవద్దు..ముందుగా తలనీనాలు సమర్పించండి.
*పుష్కరిణిలో స్నానం*
స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించే భాగ్యాన్ని పొందమంటారు ఆధ్యాత్మిక వేత్తలు
*వరాహస్వామి*
*వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీనివాసుడి దర్శనం చేసుకోకూడదు.*
వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ
దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి
వరాహస్వామి కన్నా ముందుగా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.
తమిళులు వరాహస్వామిని జ్ఞానం ఇచ్చే స్వామిగా భావిస్తారు. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా తిరుమల ఆలయంలోపలకు వెళితే ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు.
*శ్రీవారి దర్శనం*
వరాహస్వామివారిని దర్శించుకున్నాక శ్రీనివాసుడిని దర్శించుకోవాలి
*శ్రీ కాళహస్తి*
చివరగా కొండదిగి కిందకు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి దర్శనంతో తిరుమల యాత్ర ముగుస్తుంది. చివరిగా శ్రీ కాళహస్తి దర్శనం ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. పురాణాల్లో దీనికి సంబంధించి ఏమీ లేదు. అయితే సాధారణంగా సర్పానికి సంబంధించిన పూజలు ఏమైనా చేసినప్పుడు గతంలో చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే శ్లోకం ఉంటుంది. ప్రాయశ్చిత్తం అంటే దోషంతో సమానం అని అందుకే ఆఖరిగా శ్రీ కాళహస్తి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అయితే దీనికి ప్రామాణికం ఏమీ లేదు. ప్రచారం అంతే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.!!
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి