28, ఆగస్టు 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ 

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా

ధృతిం న విందామి శమం చ విష్ణో (24)


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని 

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస (25)


ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా.. జగన్నివాసా.. దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

కామెంట్‌లు లేవు: