25, ఏప్రిల్ 2025, శుక్రవారం

లక్ష్మీ_కటాక్షం_లభించాలంటే_ఇలా_చేయండి

 *లక్ష్మీ_కటాక్షం_లభించాలంటే_ఇలా_చేయండి*



ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను 

కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, 

ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.


సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం

చేసుకోవాలి.


సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.


ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.


సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.


ఇళ్ళు శుభ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు.


ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.


పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే...ఒక స్పూను 

తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి.


గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, 

దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి.


ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి.


తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే 

లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.


ఆర్థికపరమైన పనుల నిమిత్తం..

బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాని శ్రీ వినాయకుడిని కానీ దర్శించుకుని వెళ్ళాలి.


శ్రీమహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి.


సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో 

ముఖం తూర్పువైపు లేదా పశ్చిమంవైపు 

ఉండేలా చూసుకోండి.


ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి, సాలెగూళ్ళు, మట్టి, చెత్త విరిగిపోయిన వస్తువులను సర్థుకోవాలి.


సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు 

చిందర వందరగా పడేయకూడదు.


గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి 

ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.


శుక్రవారంనాడు.. ఉదయాన్నే..ఇంటి సింహద్వారం గడపకు..(ఇంట్లోని గడపలకు కూడా)

తులసి కోటకు.. పసుపురాసి..బొట్లు పెడితే..

లక్ష్మీ అనుగ్రహముతో పాటు..

ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు..

చెప్పినమాట వింటారు.

కొడుకులున్నవారికి..అణుకువ ఉన్న కోడళ్ళు..

కూతుర్లున్నవారికి..కొడుకుల్లాంటి..అల్లుళ్లు వస్తారు.


పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.🙏



🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹    


              *ఆహార ప్రభావం..!!*



*మనం "భుజించే" ఆహారమును అనుసరించే మన "ఆలోచనలు" చెలరేగుతాయి.* 


*దీనిని పురస్కరించుకుని భగవద్గీతలో పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి, అని చెప్పబడింది.*


*పదార్థశుద్ధి అనగా కేవలం కల్తీలేని ఆహార పదార్ధమని  కాదు దాని అర్థం.*


*ఎటువంటి అధర్మ మార్గములో ఆర్జించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థమో, అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారం భుకించినవాని పైన ఉంటుంది.*


*ఎట్టి ఆహారమో "అట్టి భావాలు" కలుగుతాయి...!!*


*మహాభారత యుద్ధము నందు భీష్ముడు అంపశయ్యపైన ఉన్నాడు.* 


*పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని వెళ్లి, దుఃఖంతో దీన వదనులై భీష్ముని వద్ద చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు.* 


*భీష్ముడు వారిని ప్రేమతో చేర పిలిచి, ధర్మప్రబోధం చేయబోతుందగా "ద్రౌపది" ఫక్కున నవ్వింది.*


*సభ్యత, సంస్కారం, సచ్ఛీలతకు ప్రతీక అయిన ద్రౌపది అటువంటి పరిస్థితిలో నవ్వడం చూసి పాండవులు నిర్ఘాంతపోయి ఆమె వైపు కోపంతో చూశారు.* 


*అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరకు పిలిచి, పాండవులను ఉద్దేశించి "మహాసాధ్వి" అయిన ద్రౌపది అకారణంగా పరిహసించదు.*


*ఆమె మనోభావాలు నాకు తెలుసు.* 


*దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మపన్నాలు, సహజ ధర్మవర్తనులైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని తోచి నవ్వింది.* 


*అది సహజం, ఆమె ప్రవర్తనలో కించిత్తు దోషం లేదు.*


*ఆనాడు దుర్యోధనుని కొలువులో ఉండటం చేత, ఆ "దుష్టార్జనతో" సంపాదించిన ఆహారంతో నా రక్తం కలుషితమయ్యింది.*


*అప్పుడు ధర్మ బోధనలు చేసే అర్హత నాకు లేదు.* 


*ఈనాడు అర్జునుని శరాఘాతంతో నాలో ఉన్న "కలుషిత రక్తం స్రవించి" ఇప్పుడు నేను స్వతంత్రుడను, ధర్మబోధన చేసే అధికారాన్ని పొందాను అని పాండవులను సమాధానపరచి ప్రసన్నులను చేశాడు.*


*ఆధ్యాత్మిక సాధనలో ఈ "ఆహార నియమం" చాలా ప్రధానమైనది ప్రభావం కలదు.*


              *🪷శుభమస్తు.🪷*

  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      107వ దివ్యదేశము 🕉


🙏 తిరుప్పార్ కడల్ ( పాల కడలి). 

క్షీరసాగరం/ పాల సముద్రం.. వైకుంఠం. 🙏


🔅 ప్రధాన దైవం:.క్షీరాబ్దినాథ పెరుమాళ్ (వ్యూహమూర్తి)

🔅 ప్రధాన దేవత: శ్రీ మహాలక్ష్మీ , 

క్షీరాబ్దిపుత్రి .

🔅 తీర్థం : అమృత తీర్థం

🔅 విమానం: అష్టాంగ విమానము

🔅 ప్రత్యక్షం: బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము


🔔 స్థలపురాణం 🔔


" ఖ్యాతం క్షీరాబ్దినాథం కలశజలదిజా భూమి సంవాహితాంఘ్రిం

 తీర్థం దివ్యం సుదాఖ్యం కలశభవ దిశం వీక్షమాణం సురేడ్యమ్‌|

అష్టాంగాఖ్యే విమానే దవళమృదుతరే శేషభోగేశయానం

ప్రాదుర్బూతం విభూత్యై శ్రుతి విమలహృదాం విశ్వరూపం ప్రపద్యే "||


💠దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది


💠పాలకడలిలో ఉన్న పురుష స్వరూపం శుద్ద సత్త్వ రూపం - అది అవతారాలకు భీజం


💠యస్యావయావ సంస్థానైః కల్పితో లోక విస్తరః |

తద్వై భగవతో రూపమ్ విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్ ||


💠నాభి కమలం లోంచి చతుర్ముఖుడిని తీసుకువచ్చిన రూపం భగవంతుడి మొదటి రూపం.

 "విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్", అది కేవలం సత్త్వం తప్ప మరొకటి ఏదీ లేనిది. 

సృష్టి చేయాలంటే రజో గుణం  ఉండాలి. 

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం ఏదైతే ఉందో అది ఏరకమైన రజో గుణం చేత కానీ, తమో గుణం చేత కానీ ధూషితమైనది కాదు. అది కేవలం విశుద్ధం. పరమ సత్త్వమైనది. 


💠మనలో కూడా సత్త్వం ఉంది కానీ అది రజస్సు తమస్సులచే ధూషితమైనది. దేవతలకీ సత్త్వం ఉంది కానీ వారి సత్త్వం కూడా రజస్సు తమస్సులచే ధూషితమైనది. రజస్సు తమస్సులతో కలిసినదే తప్ప విశుద్ద సత్త్వం కాదు.


💠 పాల కడలిలో పవళించి ఉన్న స్వామిది మాత్రమే విశుద్ద సత్త్వం. 

సహజమైన రూపంలోంచి వచ్చాడు కనుక అక్కడ ఎట్లాంటి దోషాలు ఉండవు. 

చాలా ఉత్కృష్టమైనది.


ఏతన్ నానావతారాణామ్ నిధానమ్ బీజమ్ అవ్యయమ్ |

యస్యాంశాంశేన సృజ్యంతే దేవ తిర్యన్ నరాదయః ||


💠ఈనాడు మనం వింటున్న దేవతా శరీరాలు కల వాళ్ళు ఎందరు ఉన్నా నర దేహాలు కల వాళ్ళు ఎవరున్నా తిర్యగాదులు ఎన్నున్నా స్థావరాదులు ఎన్నున్నా ఇవన్నీ కూడా ఆ పాలకడలిలో ఉన్న పురుష స్వరూపంలోంచి వచ్చినవే. 

అందులో ఉన్న జ్ఞానంలోంచి ఒక చిన్న అంశ.ఏయే అవతారాల గురించి వింటున్నామో అవన్నీ దాంట్లోచి వచ్చినవే. "నానావతారాణామ్ నిధానమ్", వీటన్నింటికీ కూడా ఆది కారణం ఆ పాలకడలిలో ఉండే స్వరూపం.

 "బీజమ్", అది భీజం. అందులోంచే అన్నీ బయటికి వస్తాయి. అట్లా బయటికి వస్తే అది తరుగుతుందా ? "అవ్యయమ్", అది ఎప్పుడూ తరిగిపోదు, అది మార్పు చెందకనే ఉంటుంది. ఇది భగవంతుడు మొట్ట మొదట ధరించిన స్వరూపం.   


💠ఈ దివ్య క్షేత్రం ఖగోళ ప్రపంచంలో ఉంది.

ఈ భూమిపై లేదు.


💠మానవ శరీరం తో దర్శించడం అసాధ్యం.

కేవలం పరమ భాగవతోతములు మాత్రమే మరణం తర్వాత దర్శించే వీలు ఉన్న దివ్యదేశం.


💠దీనికి విష్ణులోకం అని కూడా పేరు.   వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషునిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటాడు. వైకుంఠం పైన ఉండేది  పరమపదం ( శ్రీమన్నారాయణ ప్రత్యక్ష చరణ సన్నిధి)   అది సమస్త లోకాల కంటే పైన ఉంటుంది, దానికి ఆవల మరింకేమీ లేదని శ్రీమద్రామానుజులు ప్రవచించారు. వైకుంఠానికి జయ విజయులు ద్వార పాలకులు. 


💠వైకుంఠం 2,62,00,000 యోజనాల దూరంలో, సత్యలోకానికి (బ్రహ్మలోకం) ఆవల మకరరాశిలో ఉంటుంది. 

విశ్వానికి దక్షిణాగ్రం విష్ణుమూర్తి నేత్రమనీ, అక్కడి నుండే విష్ణువు విశ్వాన్ని పాలిస్తూంటాడనీ ఒక భావన..


🙏 జై శ్రీమన్నారాయణ 🙏 *భారతీయం* 🔔


సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?


కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పహల్గాం దాడి కారణంగా భారత్‌ పాకిస్తాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటుంది.


అటారీ బార్డర్‌ కూడా మూసివేయనుంది. ఇక పాకిస్తాన్‌తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొన్ని ఏళ్ల క్రితం చేసుకున్న సింధూ నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది. ఈ అగ్రిమెంటు నిలిపివేయడం వల్ల చిన్న సింధు నది, జీలం, బియాజ్, సట్లేజ్‌ నది నీళ్లు పాకిస్తాన్ కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు. వ్యవసాయం ఇతర అవసరాలను తీరుస్తాయి.


సింధూ నది అగ్రిమెంట్ ఏమిటి ?

సింధూ నది అగ్రిమెంటు 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరుదేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ, తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంటు కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయుభ్‌ ఖాన్‌ మధ్యలో జరిగింది.


ఈ అగ్రిమెంటు ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్‌లేజ్‌ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్‌ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులు అయిన సింధు, చీనబ్‌, జీలం 99 బిలియన్ల మెట్రిక్‌ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధూ నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది.జీల, చీనబ్‌ ఉపనదులపై భారత్‌ కిషన్‌ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది.


భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది.


2019 పూల్వామా అటాక్‌ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పారు. ప్రస్తుతం మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రమూక టీఆర్‌ఎఫ్‌కు లష్కరే తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నది జలాల ఒప్పందంతో పాటు పాకిస్తానీయులకు వీసా కూడా నిలుపుదల చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయారు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: