*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*భవ బంధాలకు కారణం భ్రమలే! లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమ చెందడం వలన మానవుడు తరతరాలుగా బంధాలలో చిక్కుకుని అసంఖ్యాకములైన జన్మలెత్తుచున్నాడు. సుఖానుభవం గల జీవితం భ్రమే.దుఃఖానుభవం గల జీవితం భ్రమే. మనసు ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి.కర్మలు ఉన్నంత వరకు సుఖఃదుఃఖాలు ఉంటాయి.జీవి లేనివాటి, కానివాటి, రానివాటి కోసం నిరంతరం పరుగులు తీస్తూ ఉంటున్నాడు. ఈ పందెంలో గెలవడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కడం అలవాటు చేసుకున్నాడు. ఇవి తప్ప ఇంకా వీటి కన్నా గొప్పది వేరే ఏదైనా ఉందా! అని కనీస అలోచన చేయడం లేదు.ఒకవేళ చేసినా కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేసినా, మధ్యలోనే వదిలేస్తున్నాడు. జన్మ జన్మలు ఇదే తంతు జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఇంకా ఎక్కడ ఉద్దరించబడతాడు. ఎన్ని విద్యలు నేర్చిన, ఎంత ధనము, బలము ఉండినా దేవుణ్ణి తెలుసుకోకుంటే జన్మ దండగే! ఆయనను తెలుసుకునే నిమిత్తమే జన్మ. ఆయనను చక్కగా తెలుసుకుంటిమా, ఇక మరల జన్మ మరి ఉండదు. భగవంతునికి ఏది ఇవ్వాలో అది తెలుసుకొని ఇవ్వాలి.ఇంక నీవేమి ఇచ్చిన,ఏమి చేసినా తీసుకొడు,చివరికి వాసన కూడా చూడడు.నీవు ఇవ్వాల్సినది నీ మనసు. నీ మనసు ఇస్తే తప్ప ఇంకేమి తీసుకొడు. మనం ఇది తప్ప ఏదైనా చేస్తాం అంటాము. కాని దైవం ఈ భూమండలంలో నీవు ఏది ఇచ్చిన తాకను కూడా తాకడు*
*నమస్కారం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి