31, ఆగస్టు 2020, సోమవారం

*భక్తి ఉండాల్సింది దేవుని మీదే

*భక్తి ఉండాల్సింది దేవుని మీదేగాని "మతాల" మీద కాదని నిరూపించిన ఒక గొప్ప భక్తుని కథ ఇది.తప్పక చదవండి..*

1984 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థాన స్వర్ణోత్సవాలు సందర్భముగా ఏదైనా కొత్త ఆర్జితసేవ ప్రవేశపెట్టాలని TTD బోర్డు సమావేశాలు జరగడం..ఏకాభిప్రాయం రాక ముగుసిపోవడం జరుగుతుంది. ఆ రోజుకూడా బోర్డు సభ్యులు కూర్చొని చర్చించుకుంటున్నారు..ఇంతలో అటెండర్ మెల్లగా తలుపుతీసుకుని అప్పటి EO పి.ఆర్ ,వి.యల్ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి భయంభయంగా "సార్ బయట ఎవరో ముస్లిమ్ భక్తుడు బయటవుండాడు..మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట"అంటూ మెల్లగా చెప్పేరు. అసలే విసుగ్గా వున్న ప్రసాద్ ఏదో అనబోయి ఆగి సరే లోపలికి రమ్మను అని చెప్పేరు..కాసేపటికి ఒక మధ్యవయస్కుడు లోనికి వచ్చి అందరికీ వినయంగా నమస్కారం చేసి, అయ్యా మాది గుంటూరుజిల్లా..మేము ముస్లిం మతస్థులమైనా శ్రీవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో చాలాకాలం నుండి పూజిస్తున్నాము.మాది చాలాపెద్ద ఉమ్మడి కుటుంబము..అయినా ప్రతిమంగళవారం స్వామి 108నామాల పేర శతనామ పూజ చేస్తాము.ఇందుకు మా ఇంట్లో పూసే రకరకాల పూలనే వాడుతాము.అయితే మా తాతగారూ 108 బంగారుపుష్పాలను తయారుచేసి స్వామివారికి సమర్పించాలని తలచి,కొన్ని పుష్పాలను తయారుచేసినాడు..కానీ ఆయన స్వామిలో ఐక్యం చెందగా మా నాన ఆ భాద్యత తీసుకున్నాడు.,ఆయన కూడా కష్టపడి కొన్ని పుష్పాలు తయారుచేయించాడు.కానీ అనుకోకుండా ఒకసారి నన్ను పిలిచి, అరే మస్తాన్ ,,నేను స్వామి పాదాల చెంత ఐక్యం కాబోతున్నాను. మిగతా పూలవిషయం నువ్వే చూసుకో అని ఆయన దైవం లో ఐక్యం చెందారు. పేదకుటుంబం,పెద్దకుటుంబమైనా కష్టపడి మా కుటుంబం 108 పుష్పాలను తయారుచేయించి,మా కుటుంబం మొత్తం 54 మందిమి కాలినడకన కొండకు చేరుకున్నాము..ఇవిగో ఆ పుష్పాలంటూ ఒక బరువువైన సంచిని టేబుల్ మీద పెడుతూ ఒక్కొక్క పుష్పం 23 గ్రాములుంటుంది.దయచేసి మా పెద్దల కోరిక మీద వాటిని స్వామి వారి కైంకర్యానికి ఉపయోగించండని చేతులు జోడించి వేడుకున్నాడు.
    అంతే బోర్డు సభ్యులెవరికీ నోటిమాట రాలేదు. ఏమి మాట్లాడో తెలియక నిశ్శబ్ధం ఏర్పడింది అక్కడ.. కాసేపటికి ప్రసాద్ గారు ముందుగా తేరుకొని కంటినిండా కన్నీళ్ళతో గబగబా మస్తాన్ దగ్గరకు వచ్చి మస్తాన్ గారూ మీ అంతటి గొప్పవ్యక్తిని ఇంతసేపు నిలబెట్టి మాట్లాడించినందుకు నన్ను క్షమించండి, రండి,రండి కుర్చొని మాట్లాడుదాం అంటూ తన చైర్ దగ్గర కుర్చొండబెట్టుకుని వివరాలన్నీ రాసుకున్నారు,.మిమ్మలిని ఆ స్వామే పంపారు..మా సమస్య తీర్చారు,,నేను చూసిన మొదటి గొప్ప భక్తులు మీరు అంటూ సాదరంగా అభినందించారు.
  అప్పుడు మొదలైందే తిరుమల దేవస్థానంలో ప్రతిమంగళవారం స్వామి వారికి చేసే అష్టోత్తర శతనామ పూజాసేవ..స్వామి వారి 108 నామాలను జపిస్తూ 108 బంగారుపుష్పాలను స్వామి పాదాల చెంత వుంచుతారు. ఆ బంగారు పుష్పాలే షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించినవి. 1984 నుండి ఇప్పటి వరకు నిరాటకంగా ప్రతి మంగళవారం ఈ సేవ జరుగుతూనే వుంది..దీనిని బట్టి మనం నమ్మవలసింది "దేవుడి"నే గాని,మతాన్ని కాదని నిరూపించిన షేక్ మస్తాన్ కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నాము.. మనదేశం లో మతసామరస్యానికి ఇదొక గొప్ప ఉదాహరణగా తెలియజెబుదాము!!!!!

(రవీంద్ర గారి వాల్ నుంచి)

కామెంట్‌లు లేవు: