19, మార్చి 2024, మంగళవారం

దైవత్వం

 *🌴దైవత్వం పొందగలమా.....!🌴*


దైవత్వం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు. సాటి మనిషిని నిస్వార్థంగా ప్రేమించి, అవసరంలో ఎదుటి మనిషికి, జీవులకు అండగా నిలిచే మనిషి దేవుడు అనిపించుకుంటాడు.

 

మనిషికి మనిషి శత్రువు కాదు... పరిస్థితులే శత్రువును చేస్తాయి...

 

ఆ పరిస్థితుల కారణంగా మనిషి ప్రవర్తించే తీరు - మనిషికి మనిషిని శత్రువుగా మారుస్తుంది..


శతృత్వం, మితృత్వం అనేది మనిషి యొక్క భావనలు.. అంతే...


శతృత్వం ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని కలిగిస్తే, మితృత్వం ప్రేమను వ్యక్తపరుస్తుంది. 


*ప్రేమతో దగ్గర తీస్తే క్రూరమృగం కూడా మచ్చిక అవుతుంది.... ప్రేమ తత్వమే దైవత్వం...*


*ఒకప్పుడు రాముడు లాంటి వాడు.. సత్య హరిశ్చంద్రుని వంటి వాడు అని అనిపించుకునేందుకు మనిషి చాలా కష్టపడే వాడు ... ఆ పోలిక చాలా ఉన్నతంగా ఉండేది ..* 


కానీ నేటి మనిషి జంతువులతో, అది కూడా క్రూర జంతువులైన సింహం, పులి, నక్క... లాంటి వాటితో పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు... 


*యత్భావం తత్భవతి... అనే విశ్వ నియమం ప్రకారం ... ఏ రకంగా మన ఆలోచనా తీరు ఉంటుందో, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.*

 

మన ఆలోచనా విధానం లో మార్పు రాకపోతే, దైవత్వం వైపు అడుగులు వేయడం అనేది పూర్తిగా అసాధ్యం..... 


ఏ గుడికో వెళ్లి ఒక దండం పడేసి, ఇంట్లో ఒక దీపం వెలిగించి, కనీసం ఇంట్లో వ్యక్తులకు కూడా గౌరవం ఇవ్వలేని వాడు దైవత్వానికి ఎలా అర్హుడు అవుతాడు?.. 


*సాటి మనిషిని ప్రేమిస్తూ, తోటి జీవజంతుజాలం పట్ల దయతో ఉంటూ, ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటే, అదే.. మనం భగవంతుడికి చేసే నిత్య పూజ. అదే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలపడానికి తొలి మెట్టు..... ఇది పూర్తిగా అలవరచుకోవాలి.*


    


     *🙏సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: