*కన్ననుc గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే*
ఈ సమస్యకు నా పూరణ.
ఉ. ఎన్ని దినంబులున్ గడిచె నెన్నడు గల్గునొ నీ యనుగ్రహం
బెన్నడొ కన్నులార నిను నీప్సను తీరగ చూచు భాగ్యమో
మన్నన చూపుమన్న విని మాకును దర్శన మీయకున్న వెం
కన్ననుc గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే.
అల్వాల లక్ష్మణ మూర్తి
*ఎలుకకు బుట్టె నేనుcగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా*
ఈ సమస్యకు నా పూరణ.
ధర్మరాజుతో వార్తాహరుడు.
చం. కలకలమున్ జనించె నృప! కందకమున్ గనుపట్టె వింతలున్
తలపయి కొమ్ములున్ మొలిచి తాండవ మాడెను సర్పమొక్కటిన్
ఎలుకకు బుట్టె నేనుcగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా!
పలికెను నక్క నాశమని వాకిలిలో - కలికాల మయ్యెనే.
అల్వాల లక్ష్మణ మూర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి