16, జులై 2020, గురువారం

బ్రాహ్మణులం ...అంటే ?


వేదపండితులు ఎక్కడా ఎవరిదగ్గరకూ వెళ్ళి పూజలు ప్రార్ధనలు మంత్రాలంటూ బలవంతపెట్టడంలేదు.ఎవరైనా వారి నమ్మకం తో వస్తేనే తెలిసింది చేస్తారు..
మనలో చాల మందికి ఎన్నో అపోహలున్నాయి బ్రాహ్మణులంటే
ఏదో వేదమంత్రాలు చదువుకొని హప్పీగా పూజలు చేసుకుంటూ బ్రతికేస్తారని,
కష్టమన్నది ఎరగకుండా సంపాదిస్తారని చాల అపోహలున్నాయి .
కాని ఏ 10% బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారు కడుపు తిప్పలకోసం
ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అన్నది కొన్ని జీవితాలను దగ్గరినుండి చూసిన
నాకు తెలుసు .
సంప్రదాయాలలో బందీలు అవుతూ చిన్న చిన్న సరదాలు కూడా కోల్పోయిన బ్రాహ్మణులూ ఎందరో ..?నాణేనికి బొమ్మా,బొరుసు ఉన్నట్లే వారి జీవితాలలో చీకటి పేజీలు ఎన్నో ఉన్నాయి.
తెల్లవారు జామున 4 గంటలకే లేచి చన్నీటి స్నానం చేసి మడి వస్త్రాన్నిధరించి మంత్రోచ్చారణ చేసుకుంటూ దేవాలయాన్ని ప్రక్షాళన చేసి మూల విరాట్టులను అభిషేకించి, చక్కగా అలంకరించి వచ్చే భక్తుల కోసం ఎదురుచూస్తూ వారి గోత్రనామాలతో అర్చన చేసి వారిచ్చే దక్షిణతో కుటుంబాన్ని వెల్లదియడం,
కొందరు ప్రభుద్దులు ఇంటికి పిలిపించుకొని పూజలు చేయించుకొని దక్షిణ ఇవ్వడం
కోసం పదిసార్లు తిప్పించుకుంటే.. మౌనంగా వెనుతిరగడం చూసాను.
.సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణులను చూస్తూ వారిని అనుకరిస్తూ వెకిలిగా నవ్వే వారిని చూసాను .
వేదాలు చదివి బ్రహ్మణ వృత్తిని చేపడితే పెళ్ళిళ్ళు కాకుండా 40 ఏళ్ళుగా బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారు నాకు తెలుసు .
మనం వారిలో కొన్ని మార్పులు రావాలని కోరుకుందాం ...
అంతే కాని హేతువాదులు,నాస్తికులు అనబడే విష పురుగులు విరజిమ్మే
అపోహల కాలుష్యం నిజమని నమ్మి వారి పట్ల అపోహలు పెంచుకుంటే ...మనదైనా
సనాతన వారసత్వాన్ని,సంప్రదాయ విలువలను కోల్పోతాం
వేద విహితమైన మన సంప్రదాయాలు, ఆచారాలు కాపాడటం హిందువుల అందరి ధర్మ. ఆ ధర్మం పాటించటం అంటే బ్రాహ్మణులను గాబురవించటం వారిని సంతోషపెట్టటమే. అప్పుడే మన హిందూ ధర్మం నిలుస్తుంది. 

కామెంట్‌లు లేవు: