10, అక్టోబర్ 2025, శుక్రవారం

అంశం.. వర్షం (బాల గేయం)

 అంశం.. వర్షం (బాల గేయం)

శీర్షిక.. చిటపట చినుకులు! 


బాలల్లారా రారండి 

ఉరకులు వేసే ఉత్సాహంతో 

పరుగులు తీస్తూ రారండి

చిటపట చినుకుల్లో చిందులు వేయగా రారండి..


నింగికి నేలకు నిచ్చెన లేస్తూ 

మబ్బులు పందిరి వేసాయండీ 

చల్లని గాలులు వీచాయండి

చిటపట చినుకుల్లో చిందులు వేయగ రారండి..


ముత్యాల తలంబ్రాలు చల్లాయండీ 

మట్టిని మాణిక్యంలా చేస్తూ 

సిరి సౌభాగ్యాలను పండించేందుకు

శ్రీరస్తు శుభమస్తని దీవించాయండీ..


కురిసాయండీ వానజల్లులు 

చెట్టూ చేమా పులకించగా 

విరుల హరివిల్లులు వికసించగా 

పైరూ పంటలు సయ్యాటలు ఆడగా..


ఏరులు సెలయేరులు ఝరులై పొంగగా 

నదులు అలలతో కిలకిలలాడగా 

ప్రకృతి కన్నియ పైయెద ఉప్పొంగగా 

ఆనందాలు చిగురులు వేయగా..


చిందులు వేద్దాం చిటపట చినుకులతో 

గెంతులు వేద్దాం వానా వానా వల్లప్పతో 

జోరుగా కురిసే వానలో హుషారుగా 

కిలకిల కలకల నవ్వుల నదిలో ఆటలు ఆడేద్దాం..!

               *******

ఇది నా స్వీయ బాలగేయం

కామెంట్‌లు లేవు: