**నిజమైన స్నేహం నిస్వార్ధంగా ఉంటుంది **
**నిర్మలంగా నిర్భయంగా ఉండమంటుంది **
@@@@ @@@@
**స్నేహాలు పలు రకాలు **
**స్నేహితులు రకరకాలు **
**అవసరం కోసం చేసే స్నేహం అవకాశం కోసం ఎదురుచూసే స్నేహం అవుతుంది ద్రోహం **
**నిజమైన స్నేహితుడికి ఉండదు అహం **
**అహం ఉన్న దేహంలో స్నేహం ఇమడదని కొందరి స్నేహితుల సందేహం **
**చాలామంది కి స్వచ్ఛమైన స్నేహం తనివితీరని దాహం **
**మంచిని పంచటంకోసం నిరంతర సన్నాహం **
**దీనిపైనా కూడా అతిగా పెంచుకోకు మోహం **
**నిజమైన ఫ్రెండ్స్ కి ద్రోహం చేస్తే జీవితం లో చూపించుకోలేవు మొహం **
**మంచివాడు ముంచేవాడిగా కనిపిస్తే నీ దృష్టి తప్పు ఈ సృష్టి తప్పు కాదు **
**స్నేహంలో ఓ హద్దుంటేనే ముద్దు హద్దుమీరిన స్నేహం వద్దు చేయొద్దు అనడంలో తప్పు లేదు **
**స్నేహం ముసుగులో కోటీస్వరులు ఉన్నారు కూటికి లేని ఈశ్వరులున్నారు **
**బంధువులతో అమ్మా నాన్నలతో కొన్ని మాత్రమే చెప్పగలం స్నేహితులతో అన్నీ చెప్పుకోగలం **
**నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పు నువ్వేమిటో నేను చెబుతా అని హీరో శోభన్ బాబు గారు నాతో చెప్పారు నేను మీకు చెబుతున్నా -*
**మంచి మెసేజ్ కి బదులు ఇవ్వనివాడు బతకడం ఎందుకు అని కొందరి ప్రశ్న **
**మంచిని పంచేవారే నా ఫ్రెండ్స్ డైమండ్స్ నా స్నేహం లో ఉండవు డిమాండ్స్ **
**నా మిత్రులే అజాత శత్రువులు **
**ఇప్పటికి 103 సార్లు వృద్ధులకు అన్నదానం చేశాము 3,300కేజీల రైస్ నిరుపేదలకు పంచాము శ్రీ షిర్డీసాయి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో **
**నా ఫ్రెండ్స్ డైమండ్స్ లా మెరుస్తారు ఆనందవర్షంలో తడుస్తారు **
**స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు నెరవేరాలి మీ ఆకాంక్షలు **
**బొమ్మిన వెంకటరమణ **
**సినీ మాటల రచయిత **
**83746 01678**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి