18, ఆగస్టు 2025, సోమవారం

నారాయణాయ

 *ఓం నమో నారాయణాయ!*


 మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి;

అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోనూ వరదలు వచ్చాయి.

స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్థం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది . దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు , నిత్య పూజలు జరుగలేదు. 

అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట!

అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయశాసనంలో ఉంది.

మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది; స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అని తిరువనంతపుర ప్రజలు భయాందోళనలు పొందారు . ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట! మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూసి నిశ్చేష్టు లయ్యారు . స్వామి వారి గర్భాలయం లోనికి నీరు ప్రవేశించలేదు . ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరచినట్లుగా పొడిగా, సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శన మిచ్చాయి . 

అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి . బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉంది; 

స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు. నాస్తికుల ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేంటో మరి!


ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ అద్భుతం నిజంగా భక్తుల హృదయాలను కదిలించే సంఘటన!


 *పురాణప్రాశస్త్యం ప్రకారం*


అనంత పద్మనాభ స్వామి నిత్యమూ దేవతల చేత పూజలు పొందుతారు అని జనం విశ్వాసం.


ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుం దనే శాసనం ఉంది.


 భారీ వర్షాలతో తిరువనంతపురం మునిగినా,

 స్వామి వారి గర్భాలయం లోనికి నీరు ప్రవేశించక పోవడం,

దీపాలు నిరంతరం వెలిగిపోవడం,

పూలమాలలు తాజాగా ఉండడం,

ధ్వజస్తంభం కూడా తేమ లేకుండా శుభ్రంగా కనిపించడం

అన్నీ ఆ పరమాత్మ అనుగ్రహానికి స్పష్టమైన సాక్ష్యం.


ఇలాటి అద్భుతాలకు శాస్త్రీయ సమాధానం ఉండదు;

అది కేవలం భక్తి, విశ్వాసం,

 దైవకృపతోనే అర్థం చేసుకోవాలి.


 ఇది భక్తుల నమ్మకాన్ని మరింత బలపరచి, స్వామి వారి అఖండ పరిరక్షణశక్తిని నిరూపించింది.


*ఓం నమో నారాయణాయ!* అనేది కేవలం మంత్రం కాదు – అది సర్వలోక రక్షకుడి సన్నిధిని పిలిచే మహావాక్యం.


*(ఓం అనంత పద్మనాభ స్వామ్యై నమః*)


‌ 🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: