సాధన చేస్తూ ఉంటే ముక్తి లభించక పోతే ఎన్నో జన్మలు గడిచిపోయాయి కదా అనే మీ ప్రశ్నకు సమాధానం - భగవద్గీత 6/40 శ్లోకం చూడండి. న హి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాక గచ్ఛతి - సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఏ సాధకుని శరీర పతనం అవుతుందో అతణ్ణి యోగ భ్రష్టుడు అంటారు.అటువంటి యోగ భ్రష్టునికి దుర్గతి ఎన్నటికీ లేదు.అటువంటి యోగ భ్రష్టుడు శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే।యోగ భ్రష్టుడు వేదవేదాంగాల అధ్యయనంతో శుచి ఐన ఇంక పైగా శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాడు.లేకపోతే యోగుల ఇంట్లోనే జన్మిస్తాడు.అప్పుడు పూర్వ జన్మలో చేసిన శ్రవణ మనన నిదిధ్యాసల వల్ల తిరిగి ఈ జన్మలో సాధన మరింతగా చేసి ముక్తిని పొందుతాడు,అని పరమాత్మే చెప్పాడు కదా!కాబట్టి మన సాధన ఎక్కడికి పోదు.అది మనల్ని ముక్తి పథం దిశగానే నడిపిస్తుంది.ఎన్ని జన్మలకు అంటే అది మనం చేసుకునే సాధన పైనే ఆధారపడి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి