7, మార్చి 2025, శుక్రవారం

ఉపనిషత్తులు ఉపవేదాలు

  అసలు మనము మన సనాతన సాంప్రదాయంలో మూలాలు బాగా పరిశీలిస్తే మనకు మొట్టమొదట వేదాలు ఉపనిషత్తులు ఉపవేదాలు ఇట్లా రకరకాల అయినటువంటి వచ్చాయి వీటిని కేవలము విద్వత్తు గల అనగా గొప్ప గురువుగారు గా ఉన్న వాళ్ళు మాత్రమే ఋషులు మహర్షులు ఇలాంటి వాళ్లంతా బాగా తెలుసుకొని అవి నలుగురికి పంచుతూ వచ్చారు. కానీ చాలామందికి ఇవి అర్థము అయ్యేటివి కావు అందువలన మరల ఈ వేదాలలోని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని ఈ పురాణాలనేటివి రచించడం జరిగినది. తర్వాత కొన్ని ఇతిహాసాలు కూడా అయినాయి అలాంటి పురాణాలే రామావతారము, శ్రీకృష్ణ అవతారం. 

మనకు దేవాలయానికి వెళితే మూలవిరాట్టును చూసి త్వరగా నమస్కారం చేసుకొని బయటికి వచ్చేస్తాం కానీ ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తే అవి కనుమరుగయ్యే వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా ఒళ్లంతా కూడా కళ్ళు చేసుకుని తిలకిస్తూ ఉంటాం అంతేకాదు తన్మయత్వంతో ఉండిపోతాం అలాంటివే ఈ పురాణాలు కూడా!!

సాక్షాత్తు శ్రీమన్నారాయణు డి అవతారము రాముడు కృష్ణుడు రామావతారంలో మానవుడు తన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి తల్లితండ్రులకు ఎలా గౌరవం ఇవ్వాలి వారిని ఎలా అభిమానించాలి అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించాలి మరుదులను ఎలా చూసుకోవాలి అని తెలిపిన వారే రాములవారు సీతా అమ్మవారు. సీతమ్మవారనగా సాక్షాత్తు ఆ ఆదిలక్ష్మి దేవే. అందులో ఎలాంటి సందేహము లేదు ఆమె కూడా తనకు తెలుసు తను ఏమైనా చేయగలను అనేది కూడా ఎక్కడ ఆమె ప్రవర్తించలేదు ఎంతో వినయము విధేయతతో మసలుకుంది దీనికి మనకు రామాయణంలో ప్రత్యేకంగా ఆత్రి మహర్షి అనసూయ దేవి దంపతుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు విషయం తెలుస్తుంది పతివ్రత ధర్మాలు ఎలా ఉండాలి అసలు ఎలా ఆచరించుకోవాలి అని వాళ్ళ ద్వారా సాక్షాత్తు ఆ జగన్మాతనే వినింది అన్నది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆమెకు తెలియక కాదు మనకు తెలియజెప్పడం కోసం ఆ తల్లి వాళ్ళ దగ్గర తెలుసుకుంది. దీనినిబట్టి భార్య భర్తలు వినయ విధేయతలతో కలిసి మెలిసి కాపురం చేసుకోవాలి అని తెలుపుతుంది శ్రీమద్రామాయణం. 


ఇక రెండవది శ్రీకృష్ణ అవతారం ఇందులో మహావిష్ణువు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి గా దిగివచ్చినట్లు తనే అవతార పురుషుడు అన్నట్టు మనకు తెలుస్తోంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఎంత అవసరమో దాని ప్రకారము ఆయన నడుచుకున్నాడు ఆయన చేయవలసిన దుష్టశిక్షణ ఆయన చేస్తూ మిగిలినవారు ఎవరు ఎవరి చేతిలో మరణించాలో దానిని వారి చేత ఆచరింపజేస్తూ అందరిని తరింపజేశాడు 

కృష్ణావతారంలో చాలా విషయాలలో చాలామంది వక్రీకరించి చెప్పడమే ఎక్కువగా ఉన్నది. రాధాకృష్ణులు వాళ్లకు వివాహమైంది అని అంటారు అది కూడా శుద్ధ తప్పు అపద్దం. ఇక ఆయన గోపిక వస్త్రాపహరణం చేశాడు అనేది దానిలో కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. పూర్వము ఒకసారి మహర్షులందరూ వైకుంఠానికి వెళ్లి సాక్షాత్తు ఆ అచ్చ్యతుడిని వరం అడిగారు దానికి ఆయన మీకు నేను ద్వాపరయుగంలో మీ కోరిక తీరుస్తాను అని చెప్పాడు ఇంతకీ ఆ వరం ఏమిటంటే ఆయనను ఒక్కసారి వీళ్ళు ఆలింగనం చేసుకోవాలి అని కోరుకున్నారు దాని ప్రకారమే శ్రీకృష్ణ అవతారంలో మీరు దేహము మీద వ్యామోహం వదిలి చేతులు పైకెత్తి నన్ను పిలిస్తే నేను వస్తాను అని చెబుతాడు ఆ విధంగానే వాళ్ళు చేస్తారు అప్పుడు వాళ్ళను అనుగ్రహిస్తాడు వాసుదేవుడు. 

ఈ విధంగా రామాయణము ధర్మపరివర్తనమును తెలియజేస్తే మహాభారతం అధర్మాన్ని అధర్మంతో జయించాలి అని తెలియజేస్తుంది. ఇవన్నీ మనకు పురాణాల ద్వారా తెలిసి మనము వాటిలోని మంచిని స్వీకరించి ముందుకు నడవాలి అని ఇలా ఆ భగవంతుడు అవతారము ఎత్తినాడు.


       నమస్కారమండీ 

                  మీ 

   చంద్రమోహన్ మాండవ్య 

🙏🍁🌿🍒🪻🦚🦜🏵️🕉️🌸

కామెంట్‌లు లేవు: