☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*విష్ణు సహస్రనామ స్తోత్రము*
*రోజూ ఒక శ్లోకం*
*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్లోకం (69)*
*కాలనేమినిహా వీరః*
*శౌరిః శూరజనేశ్వరః ।*
*త్రిలోకాత్మా త్రిలోకేశః*
*కేశవః కేశిహా హరిః ॥*
*ప్రతి పదార్థం:~*
*646) కాలనేమినిహా - కాల చక్రమునకు అంచు అయిన అవిద్యను (అజ్ఞానమును) విధ్వంసం చేసేవాడు; కాలనేమి యను రాక్షసుని సంహరించినవాడు.*
*647) వీరః : - సదా శౌర్య వంతుడు, విజయము పొందేవాడు; వీరత్వము గలవాడు.*
*648) శౌరిః : - శూరుని పుత్రుడు (వసుదేవుని మరొక పేరు శూరుడు)*
*649) శూరజనేస్వరః : - శూరులు అయినవారికి ప్రభువు; శూరులలో శ్రేష్ఠుడు.*
*650) త్రిలోకాత్మా - మూడు లోకములలోని సకలములకు అంతరాత్మ.;*
*651) త్రిలోకేశః : - మూడు లోకములకు ప్రభువు.*
*652) కేశవః : - సుందరమైన కేశములు కలవాడు;*
*653) కేశిహాః : - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.*
*654) హరిః : - పచ్చని శరీరచ్ఛాయ కలిగిన వాడు; తన భక్తుల దుఃఖమును హరించువాడు;*
*తాత్పర్యం :~*
*కాలనేమి యను రాక్షసుని సంహరించినవాడును, కాలాతీతుడును, మహావీరుడును, మహా వీర్యసంపన్నుడును, శూరుడను వాని వంశమున జన్మించినవాడును, మిక్కిలి శూరులగు వారందరికంటే ప్రసిద్ధుడును, మూడు లోకములకును ఆత్మయై యున్నవాడును, మూడు లోకములకును అధిపతియును, సుందరమగు కేశములతో భాసిల్లువాడును, కేశి యను దుష్టరాక్షసుని సంహరించిన వాడును, సంసార భయమును హరించువాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*
*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సూచన*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*జ్యేష్ట నక్షత్రం 1వ పాదం జాతకులు పై 69వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఓం నమో నారాయణాయ!*
*ఓం నమః శివాయ!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి