4, అక్టోబర్ 2020, ఆదివారం

*ధార్మికగీత - 39*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        

                                       *****

           *శ్లో:- కృషితో నాస్తి దుర్భిక్షం ౹*

                  *జపతో నాస్తి పాతకః ౹*

                  *మౌనేన కలహో నాస్తి ౹*

                  *నాస్తి జాగరతో భయమ్* ౹౹

                                     *****

*భా:- కృషి అంటే వ్యవసాయము, శ్రమ. ప్రయత్నము అని అర్థాలు. అన్నదాత నిరంతర సేద్యము సకల ప్రాణికోటికి జీవనాధారమై, కార్మిక, శ్రామిక, ఉద్యోగి, మేధావి వర్గాల అకుంఠిత శ్రమయే దేశ ప్రగతి రథానికి దీటైన చక్రమైనప్పుడు కరువు కాటకములే ఉండవు. స్వర్ణా పహరణ, సురా పానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, వీరితో సహవాసము చేయడం అనే పంచ మహా పాతకాలు కూడా తీవ్రాతితీవ్ర జపమువల్ల తొలగి పోతాయి. అధికారి- ఉద్యోగి; భార్య- భర్త; అన్న- తమ్ముడు; యజమాని- సేవకుడు ఇలా ఇరుపక్షాలలో ఒకరు ఆవేశంతో ఊగి పోతున్నప్పుడు మరొకరు ఒక్కనిమిషం మౌనం వహిస్తే అసలు కలహమే ఉండదు. ప్రతి పనిలోను మనసుపెట్టి ఆచితూచి, జాగరూకతతో ఉండేవారికి భయమనేది ఉండనే ఉండదు. పాపాల, కలహాల జోలికి పోకుండా, కష్టపడి పనిచేసే తత్త్వాన్ని అలవరచుకొంటూ,కార్యసాధనలో అప్రమత్తంగా పురోగమిస్తే జయము, విజయము, దిగ్విజయము మనలను వరించి వస్తాయని సారాంశము.*

                                    *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: