21, నవంబర్ 2025, శుక్రవారం

పంచాంగం

 జై శ్రీమన్నారాయణ 

21.11.2025, శుక్రవారం 

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*   

*దక్షిణాయనం - హేమంత ఋతువు*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*  

*తిథి   : పాడ్యమి మ12.45 వరకు*

*వారం   :భృగువాసరే  (శుక్రవారం)*

*నక్షత్రం : అనూరాధ మ1.02 వరకు*

*యోగం : అతిగండ ఉ10.48 వరకు*

*కరణం  : బవ మ12.45 వరకు*

*తదుపరి బాలువ రా1.47 వరకు*

*వర్జ్యం  :  రా7.32 - 8.58 దుర్ముహూర్తము : ఉ8.25 - 9.10*

*మరల మ12.08 - 12.52*

*అమృతకాలం : తె5.48 నుండి*

*రాహుకాలం    : ఉ10.30 - 12.00*

*యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30*

*సూర్యరాశి: వృశ్చికం* 

*చంద్రరాశి: వృశ్చికం*

*సూర్యోదయం: 6.12* 

*సూర్యాస్తమయం: 5.20*


*


కార్తీకమాసం ఈ అమావాస్యతో అంటే.. నిన్నటి రోజు గురువారం 20వ తేదీతో ముగిసింది. ఆ మరునాడు అంటే ఈరోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమని జరుపుకుంటారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు.  ఈరోజు శుక్రవారం పోలి పాడ్యమిని జరుపుకుంటారు. ఈ పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది.


'మాసానాం మార్గశీర్షోహం'

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా 'మాసానాం మార్గశీర్షోహం' అంటే మార్గశిర మాసం మాసాలలోకెల్లా 'శీర్షం' అంటే' శిరసు' వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికే మార్గశిరమని పేరు.

 మాసాల్లో మార్గశిరాన్ని నేను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలిపారు అని శాస్త్రం చెబుతుంది.


 *ధనుర్మాసం* 

ఈ నెలలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. శ్రీ వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన పండుగ . వైష్ణవాలయాలను దర్శించేందుకు, నారాయణుడిని అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది. వివాహం కావలసిన అమ్మాయిలు కాత్యాయనీ (తిరుప్పావై )వ్రతం ఆచరించడం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం ఈ మాసం ప్రత్యేకతలు.


 *ఈ రోజు దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఇదే..!* 

 *శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపదః, శత్రు బుద్ధి వినాశాయ, దీప జ్యోతి నమోస్తుతే"* అనే మంత్రాన్ని చదవాలి


తొలి నుంచి ఈ మాసాంతం వరకు అన్ని శుభ తిథులే. ఇక పోలి పాడ్యమి ఈ రోజు మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి చెరువులు, నదుల్లో దీపాలు వదులుతారు.. ఈ రోజు మరి ముఖ్యంగా పోలి కథను చదువుకోంటారు.  ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. ఈపాడ్యమి రోజు 30 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు...


మార్గశిర మాసం వచ్చిందంటే చాలు తూర్పు తీర నగరం విశాఖపట్నం బురుజుపేటలో కొలువు తీరిన శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పే కాదు.. రాష్ట్ర ప్రజల కొంగు బంగారంగా అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆమె వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ మాసంలో.. అది, గురువారం అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. మార్గ శిర గురువారం కనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో బురుజుపేటలోని ఆలయం జన సంద్రంగా మారుతుంది...


 *ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం. మోక్షాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ!*

కామెంట్‌లు లేవు: