21, నవంబర్ 2025, శుక్రవారం

మనం గొప్పవారం కాదు!!

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸  

ఏ.. విషయంలో.. మనం గొప్పవారం కాదు!!

పది మంది కస్టపడి.. కృషి చేసి మన తో నడిస్తే.. మనం గొప్ప వారం అవుతాం!!

ఇదేదో.. నా ప్రతిభ... అనుకోవడం ఖచ్చితంగా మన అమాయకత్వం!!!

ఒక వేళ ఒక కార్యక్రమం సక్సెస్ అయ్యింది... అది నీది కాదు! నీ ప్రతిభ కాదు.. అది అక్కడకు హాజరు అయ్యిన వారిది!! 

ఏదైనా.. ""సక్సెస్"" "గొప్ప"" ఖచ్చితంగా భగవత్ అర్పితం చేయగలిగే తత్వం.. పెంచుకోవాలి...

అలాగే ఒక కార్యక్రమం.. ఫెయిల్ అయ్యే సందర్భం ఉంటుంది!! దానికి భాద్యత వహించవలిసినది... నిర్వాహకులే...

కారణాలు విశ్లేషణ చెయ్యాలి.. ఎందుకు దూరం జరుగుతున్నారు అని ఆలోచన చెయ్యాలి...

మనం ఒకరిని పదే పదే విమర్శ చేస్తున్నప్పుడు...

ఖచ్చితంగా మనల్ని గమనించే వారు చాలా మంది పెరుగుతూ ఉంటారు!!

సమర్ధుడు సక్సెస్ ఫెయిల్ రెండూ ఒకేలా భావిస్తాడు!!

అసమర్ధుడు ఈర్ష్యా పరుడు స్వార్ధం కోసం పరితపించేవాడు... వాళ్ళని వీళ్ళని భాద్యులు చేస్తూ.. నిందలు వేస్తాడు!!

నిస్వార్ధ భగవత్ అర్పితం చేసి అమ్మవారి మీద భారం వెయ్యి ఖచ్చితంగా అమ్మవారే వెంట ఉండి ముందుకు నడిపిస్తారు!!

జనాలు చేసే... భూషణ దూషణలు... లెక్క చెయ్యక్కర్లేదు!!

భగవంతుడు కోర్ట్ లో.. భగవంతుడు అనుగ్రహo కోరుకోవాలి.. అది సరి అయిన సన్మానం 

దానిముందు ఏ సన్మానం సరిపోతుంది??

మిర్తిపాటి

కామెంట్‌లు లేవు: