21, నవంబర్ 2025, శుక్రవారం

సర్వం ఖల్విదం బ్రహ్మ*

  సర్వం ఖల్విదం బ్రహ్మ*

ఇది ఛాందోగ్యోపనిషత్తులోని ఒక మహా వాక్యం దీని భావం ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే బ్రహ్మ కానిది అంటూ ఏది లేదు అనేదే ఈ మహా వాక్యంలోని అర్థము దీనిని ఒక చిన్న కథ ద్వారా విశ్లేషిద్దాము.

*ఒకరోజు రామారావు ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతడు అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేసావు అంటాడు…*

*వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమీ ఉపయోగం లేదు. వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది.*

* వడ్డించిన ఇల్లాలు ఇది నా గొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండిపెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది.*

*యజమాని ఇందులో నా గొప్పతనమేమి లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు.*

*భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అనగా.. జలం ఆగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి ఇలా చివరకు మా అందరికి ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే “పరమాత్మ” ఆయనకు నమస్కరించమని చెబుతారు.*

*మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే..*

*సృష్ఠిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే.. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటిని సృష్టించిన వాడు, వాటన్నిటికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఈ సత్యం తెలుసుకొని ప్రతి సాధకుడు ఈ చరాచర జగత్తు మొత్తం పరబ్రహ్మ కలిగి ఉన్నాడు అనే భావనలోకి వచ్చి తను కూడా పరబ్రహ్మలో ఒక అంశం అని తెలుసుకొని పరబ్రహ్మలో లీనయినమయ్యే టందుకు అంటే మోక్షమార్గాన్ని ఎంచుకొని నిత్యం మోక్ష పదం వైపు పయనించాలని ఈ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము.*

ఓం శాంతి శాంతి శాంతిః

 ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: