21, నవంబర్ 2025, శుక్రవారం

అపూర్వమైన వరం

 🙏🕉️శ్రీమాత్రేనమః శుభోదయం🕉️🙏 🔥 * *భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన వరం మనసు.. కంటికి కనిపించదు.. చెంచలత్వం ఎక్కువ.. కానీ కనపడనంత దూర తీరాలు విహరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది.. ఆనందమయమైన మరో లోకం లో విహరింపజేస్తుంది.. మంచిని మరియు చెడుని సమతుల్యంగా స్వీకరిస్తుంది.. మన కంటితో చూడనివి చెవితో వినని విషయాలను పలికిస్తుంది.. దాని వల్ల బంధాలు అనుబంధాలు మరియు స్నేహ సంబంధాలు పాడుచేస్తుంది..ఈ మనసు నాలుకచే మంచిని మరియు చెడుని

చేప్పిస్తుంది.. కొంతమందికి అమృతంలాగా మరి కొంతమందికి చేదుగాను అనిపిస్తుంది అది వాళ్ళు దాన్ని తాగి ఆనందం పొందవచ్చు లేదా బిలి కావచ్చు🔥 ఎవరైతే మనసును అదుపులో ఉంచుకుంటారో వారికి ఆ మనసే బంధువు అవుతుంది.. ఎవరైతే మనసు అదుపులో ఉంచుకోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపజేస్తారో వారికీ ఆ మనసే శత్రువు అవుతుంది.. అందుకే మనసుని దైవచింతనతో నింపి పలికే ప్రతీ మాట సంతోషకరమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి*🔥🔥మీ *అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D. N.29-2-3. గోక వరం బస్ స్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. 

కామెంట్‌లు లేవు: