8, జులై 2025, మంగళవారం

మార్కండేయుడి తండ్రి

 మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి ఒక సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ దురద పోవడానికి వారి శరీరాన్ని రాయిలా పరిగణించి రాపిడిచేసి తమ దురదలను తీర్చుకొనేవి కదా. అలా మృగముల దురదలను తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారని ప్రతీతి. ఇది సమంజసముగా వుంది. 


ఇలా ఆనాటి ఋషులు వందలు వేల కొలది సంవత్సరాలు తపస్సు నాచరించటంతో కొందరి చుట్టూ పుట్టలు విపరీతంగా పెరిగిపోవడం, కొందరు ఇలా మృకండుడులా శిలలా తయారు కావడం తరచూ జరిగేవేమో. 


ఇలా శిలలాగా రూపాంతరం చెందిన మృకండుడుని మృగాలు తమ తమ దురదలను తీర్చుకోవడం కోసం వాడుకోవడం గొప్ప విషయమే. 


కాని మరో చిన్న సందేహం, మృగాలు దురదలు తీర్చుకొన్నాయి కనుక మృకండుడు అయ్యారు కదా, అంతకు ముందు అంటే వారి పూర్వపు నామధేయం ఎలా ఉండేదని, ఎవరైనా తెలియజేయగలరు.

కామెంట్‌లు లేవు: