ధనవంతులైన అంధులు
పరమాచార్యు స్వామివారు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారు ఎక్కడ మకాం చేస్తే ,అక్కడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు.
స్వామివారు మకాంచేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు, కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు, వారు భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సులకోశం లోపలకు వెడుతూ వారిని తన్నాడు కూడా.
స్వామివారి దర్శనం కోసం చాలా మంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురుచూసేలాగా చేశారు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులుంచి నమస్కరించాగనే, స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. “నేను ఏమీ ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది. కానీ నీవు వారిని దుర్బాషలాడడమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు" చెప్పారు స్వామివారు.
ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి, క్షమాపణలు కోరుతూ, “నేను చాలా పెద్ద అపచారం చేశాను, నన్ను మన్నించి రక్షించండి” అని వేడుకున్నాడు.
వెంటనే స్వామివారు కరుణతో, మృదుస్వరంతో “ఇక్కడే ఉన్న పాపవినేశ్వర స్వామిని సేవించి పూజించు. నీ పాపానికి పరిహారం పొందు" అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాపవినేశ్వరునిగా దర్శనమిచ్చి, "ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చెయ్ – అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది" అని చెప్పారు.
తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్లి, ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకుని రోదించాడు. "నేను మహా పాపం చేశాను. మీరు ముగ్గురికీ చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను. నన్ను ఈ పని చేయమని సాక్షాత్తు ఆ పాపవినేశ్వరుడే ఆదేశించాడు” అంటూ అప్పటికప్పుడు వారికి 20 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి తిరస్కరించకండి అని బ్రతిమలాడాడు.
తర్వాత వారిని చెన్నైకి తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని, శస్త్రచికిత్స చేయించాడు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి చూపు లభించింది. ఇప్పుడు వారు ఈజిప్టులో ఉన్నారు. స్వామివారి అపార కరుణ వల్ల ఒక అంధ, పేద కుటుంబం, చూపును పొంది ధనవంతులుగా మారిపోయారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి