ధర్మోపాత్త జీవితానాం జనానాం
శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానామ్౹
జితేంద్రియాణా మతిథి ప్రియాణాం
గృహేషు మోక్ష: పురుషోత్తమానామ్॥
ధర్మ-ధర్మబద్ధమైన విధంగా,
ఉపాత్త-నడిచే,
జీవితానాం-జీవనము గల వారును,
శాస్త్రేషు-శాస్త్రములందును,
జ్ఞానేషు-వివిధ జ్ఞాన విషయాలందును,
సదా-నిత్యమును,
రతానాం-ఆసక్తి గల వారును,
జిత ఇంద్రియాణాం-ఇంద్రియ నిగ్రహము గల వారును,
అతిథి ప్రియాణాం-అతిథుల పట్ల ఇష్టము గల వారును ఐన,
జనానాం-జనులకు,
పురుష ఉత్తమానాం-మహా పురుషులకు,
మోక్ష: -మోక్షము,
గృహేషు-ఇళ్ళయందే(ఉంటుంది)॥
ఈలోకంలో ధర్మంగా ఆర్జించిన జీవ ధన సంపదలును, శాస్త్ర విజ్ఞాన విషయాలందు ఆసక్తియును, ఇంద్రియ నిగ్రహమును, అతిథులపట్ల ఇష్ట మును అనే ఉత్తమ లక్షణా లున్న మహా పురుషులకు మోక్షము తమ తమ ఇళ్లలోనే ఉంటుంది॥
8-7-25/మంగళవారం/రెంటాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి