22, జులై 2023, శనివారం

వేదవేత్తల విషయంలో

 వేదవేత్తల విషయంలో కృతజ్ఞత ఆవశ్యకం


జీవితంలో ధర్మాన్ని ఆచరించటం వలన సకల శ్రేయస్సులు, ఆధ్యాత్మిక కుశలత, అలానే క్షేమము లభిస్తాయి. ఆ ధర్మానికి మూలం వేదమే. వేదమూలకంగానే విధి, నిషేధాలను తెలుసుకోగలం. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసి ఒకరినుంచిఒకరికి వేదవిద్యను సంక్రమింపజేస్తారు. వీరిని వేదవేత్తలు అని వ్యవహరిస్తాము. వీరు సదా పూజ్యులు.


వేదవేత్తలకుగాక ఇంకెవర్ని నమస్కరించాలి అంటే భోజమహరాజు తాను రాసిన చంపూరామాయణం ప్రారంభంలో ఈవిధంగా వర్ణిస్తాడు, మన ధర్మశాస్త్రాలన్నీ "ధర్మో రక్షతి రక్షితః" అని పలికాయి. అంటే, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిని ధర్మం కాపాడుతుంది. అంతేకాక ధర్మాన్ని ఉల్లంగించితే మాత్రం వారికీ పతనంతప్పదు.

धर्म एवहतो हन्ति धर्मो रक्षति रक्षितः |

तस्माद् धर्मो न हस्तव्य मानो धर्मोहतोवधीत् ||


ధర్మానికి పునాది వేదము. వీటితోపాటు పురాణాలు, స్మృతులు, శాస్త్రములు మొదలైనవి. ఇవ్వన్నీ వేద ప్రమాణంగా ఉండాలి. వేదములు అపౌరుషేయాలు, స్మృతులు, పురాణాలు మొదలైనవి పురుష నిర్మితాలు. మన పూర్వులు వేదాధ్యయనపరులై మనకందరికీ ఆ వేదసంపదను అందజేసి మహోపకారం చేశారు. అట్టివారిపట్ల మనం ఎల్లప్పుడూ కచ్చితంగా కృతజ్ఞత చూపాలి.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

కామెంట్‌లు లేవు: